ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన అక్కినేని నాగార్జున.. కొన్నేళ్ల నుంచి సరైన విజయాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ తర్వాత ఆ స్థాయి సక్సెస్ లేదు నాగ్‌కు. ఆ సినిమాకు సీక్వెల్ కావడం వల్ల, ఈ సంక్రాంతికి పెద్దగా పోటీ లేకపోవడం వల్ల ‘బంగార్రాజు’ ఓ మాదిరిగా ఆడేసింది కానీ.. మిగతా చిత్రాలన్నీ నాగ్‌కు చేదు అనుభవాలే మిగిల్చాయి.
గత ఏడాది రిలీజైన ‘వైల్డ్ డాగ్’ మంచి టాక్ తెచ్చుకుని కూడా వసూళ్లు రాబట్టలేకపోయింది. ఇప్పుడు అదే స్టయిల్లో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ ‘ది ఘోస్ట్’ మీద నాగ్ ఆశలన్నీ నిలిచి ఉన్నాయి. గురువారం సాయంత్రమే రిలీజైన ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగానే ఉండి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. కాకపోతే ఈ ఆసక్తి వసూళ్ల రూపంలోకి మారుతుందా లేదా అన్నది అక్టోబరు 5న తేలుతుంది. ఈ విషయం పక్కన పెడితే ‘ది ఘోస్ట్’ ట్రైలర్‌ను లాంచ్ చేసిన సూపర్ స్టార్ మహేష్‌కు థ్యాంక్స్ చెబుతూ నాగ్ వేసిన ట్వీట్ ఆసక్తికర చర్చకు దారి తీసింది.
‘‘హేయ్ మహేష్.. 29 ఏళ్ల క్రితం మీ నాన్న సూపర్ స్టార్ కృష్ణ గారు నాతో కలిసి వారసుడు సినిమా చేయడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. మరి నువ్వెందుకు ఆ వృత్తాన్ని పూర్తి చేయకూడదు. ది ఘోస్ట్ ట్రైలర్‌ను లాంచ్ చేసినందుకు ధన్యవాదాలు’’ అని నాగ్ ట్వీట్ చేశాడు. అప్పుడు కృష్ణ తన సినిమాలో నటించాడని.. ఇప్పుడు నీ సినిమాలో నేను నటిస్తా అని నాగ్ ఆఫర్ చేస్తుండడం విశేషమే. ఐతే నాగ్ యధాలాపంగా ఈ మాట అన్నాడా.. లేక దీని వెనుక సీరియస్‌గా ఏదైనా ఉద్దేశం ఉందా అన్నది ఆసక్తికరం.
త్రివిక్రమ్ సినిమా తర్వాత మహేష్ బాబు నటించబోయే రాజమౌళి సినిమాలో నాగ్ ఏమైనా అతిథి పాత్ర లాంటిది చేయబోతున్నాడా అన్న సందేహాలను ఈ ట్వీట్ రేకెత్తించింది. దానికి తోడు మహేష్.. సంపూర్ణ ఆనందంగా ఉంటుంది.. ఎదురుచూడాల్సిన విషయం!.. అని మరో ట్వీట్ చేశాడు. దీంతో ఏదో ప్లాన్ వేసినట్లు ఉన్నారని నెటిజన్లు ఊహించేసుకుంటున్నారు. రాజమౌళితో నాగ్‌కు మంచి అనుబంధం ఉంది. ఇక జక్కన్న సినిమాల్లో ప్రత్యేక, అతిథి పాత్రలు మామూలే. కాబట్టి మహేష్ సినిమాలో నాగ్ కోసం ఏదైనా రోల్ క్రియేట్ చేస్తే ఆశ్చర్యమేమీ లేదు. దీని గురించి నాగ్ హింట్ ఇచ్చి ఉంటాడేమో అని అక్కినేని ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు.
This post was last modified on August 25, 2022 10:51 pm
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…