ఆర్.ఆర్.ఆర్. చిత్రాన్ని ఈ జులై 30న విడుదల చేయాలనేది ఒరిజినల్ ప్లాన్. అయితే ఈ చిత్రం షూటింగ్ లో జాప్యం జరగడంతో జనవరి 8, 2020న విడుదల చేస్తామని ప్రకటించారు. అంతా ఆర్డర్లో వెళుతోంది అనుకునేంతలో కరోనా విపత్తు వచ్చి పడింది.
ఇక జనవరి 8న ఈ చిత్రం రావడమనేది అసాధ్యం కావడంతో నెక్స్ట్ ఏ డేట్ టార్గెట్ పెట్టుకోవాలని చూసారు. మళ్ళీ జులై 30 బెస్ట్ డేట్ అని డిసైడ్ అయ్యారు. అప్పటికి టార్గెట్ పెట్టుకుంటే ఒత్తిడి లేకుండా చేసుకోవచ్చనేది ఐడియా. పైగా జులై మాసం రాజమౌళికి బాగా కలిసొచ్చింది. సింహాద్రి, మగధీర, ఈగ, బాహుబలి 1 అన్నీ జూలైలోనే విడుదలయి ఘన విజయం సాధించాయి. అందుకే రాజమౌళి సెంటిమెంట్ పరంగా కూడా ఈ డేట్ కి ఫిక్స్ అయ్యాడట.
అప్పటికి ప్లాన్ చేసుకోవడం వల్ల షూటింగ్ మొదలు కావడానికి మరో మూడు నెలల సమయం పట్టినా ప్రెజర్ ఉండదని భావిస్తున్నారు. హైదరాబాద్ కరోనాకు ఎపి సెంటర్ గా మారిన నేపథ్యంలో ఇప్పట్లో షూటింగ్ మొదలయ్యే పరిస్థితి లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates