అల్లు అర్జున్ కి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ ఇవ్వడంతో పాటు, యూట్యూబ్ లో కూడా పలు చెదిరిపోని రికార్డులు నెలకొల్పిన అల వైకుంఠపురములో అతనికి మరో యూట్యూబ్ రికార్డు ఇచ్చింది. టిక్ టాక్ లో సంచలనంగా మరీనా బుట్ట బొమ్మ పాట వీడియో సాంగ్ కి 250 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
ఇంతవరకు తెలుగు సినిమా వీడియో సాంగ్స్ లో ఫిదాలోని వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే ఒకటే ఈ ఫీట్ సాధించింది. త్వరలోనే ఆ పాట వ్యూస్ ని కూడా బుట్ట బొమ్మ వీడియో దాటనుంది. ఇక ఇదే చిత్రంలోని రాములో రాముల లిరికల్ వీడియో 300 మిలియన్ వ్యూస్ సాధించే దిశగా దూసుకెళ్తోంది.
బుట్ట బొమ్మ వీడియో జోరు చూస్తే రాములో రాములా రికార్డు కూడా త్వరలోనే అధిగమిస్తోందని అనిపిస్తోంది. మరి టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత కూడా ఈ పాటకు అదే స్థాయి క్రేజ్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది చూడాలి.
This post was last modified on July 4, 2020 7:01 pm
వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు శుక్రవారం ఊహించని షాక్ తగిలింది. పోలీసుల అదుపులోని నిందితుడిపై…
దక్షిణాదిలో కీలక రాష్ట్రంగా కొనసాగుతున్న తమిళనాడులో శుక్రవారం రాజకీయంగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడులో విపక్ష పార్టీగా ఉన్న…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి శుక్రవారంతో 10 మాసాలు గడిచాయి. గత ఏడాది జూన్ 12న ఏపీలో కూటమి సర్కారుకొలువు…
హర్యానా బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ రెజ్లర్, ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలి రాప్తాడు పర్యటనపై సాగుతున్న మాటల యుద్ధంలో తాజాగా ఆ పార్టీ…
వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం గురువారం ఎంత రచ్చగా మారిందో… శుక్రవారం కూడా అంతే…