Movie News

తమిళ్ రాకర్స్‌లో ‘తమిళ్ రాకర్స్’

తమిళ్ రాకర్స్.. సౌత్ ఇండియాలో ఏ కొత్త సినిమా రిలీజైనా కొన్ని గంటల్లో పైరసీ ప్రింట్ ప్రత్యక్షమయ్యే వెబ్ సైట్. గతంలో కొత్త సినిమాలను పైరసీ చేసి సీడీలేసి అమ్మేది ఈ సంస్థ. టెక్నాలజీ పెరిగాక వెబ్ సైట్ ద్వారా వ్యవహారం నడిపించింది. దీని అడ్మిన్స్ ఎక్కడో విదేశాల్లో ఎవరికీ దొరక్కుండా సర్వర్ మెయింటైన్ చేస్తూ.. కొత్త సినిమాలను పైరసీ చేస్తుంటారు. ఈ వెబ్ సైట్‌ను నియంత్రించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది.

ఆ వెబ్ సైట్‌ను నిషేధిత జాబితాలో పెట్టి అది పని చేయకుండా చేసినా.. తన సబ్‌స్క్రైబర్లకు మెయిల్ ద్వారా పైరసీ లింక్స్ పంపిస్తూ.. ఈ బిజినెస్‌ను విజయవంతంగా నడిపిస్తున్నారు. ప్రధానంగా తమిళ సినిమాల మీదే ఈ సంస్థ ఫోకస్ ఉంటుంది కానీ.. వేరే భాషల చిత్రాలను కూడా పైరసీ చేసి ఇంటర్నెట్లో పెట్టేస్తుంటుంది ఈ సంస్థ. కోలీవుడ్ దీన్ని మూయించడానికి చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.

కానీ దానికి బ్రేక్ మాత్రం పడలేదు. కాగా ఇప్పుడు తమిళ్ రాకర్స్ పైరసీ వ్యవహారం మీద అరుణ్ విజయ్ ప్రధాన పాత్రలో అరివళగన్ ఈ సిరీస్‌ను రూపొందించాడు. సోనీ లివ్ దీన్ని స్ట్రీమ్ చేస్తోంది. ఐతే తాము చేసే పైరసీ వ్యవహారాల చుట్టూ తిరిగే వెబ్ సిరీస్‌ను సైతం తమిళ్ రాకర్స్ వాళ్లు విడిచిపెట్టలేదు. ఈ సిరీస్ రిలీజైన కొన్ని రోజులకే పైరసీ ప్రింట్ రెడీ చేసేశారు. దాన్ని తమ సబ్‌స్క్రైబర్లందరికీ పంపించేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

దీని మీద బోలెడన్ని మీమ్స్, జోక్స్ కనిపిస్తున్నాయి సామాజిక మాధ్యమాల్లో. ఈ థ్రిల్లర్ సిరీస్‌‌లో ఇదే అసలైన ట్విస్టు, ఇది యాంటీ క్లైమాక్స్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తమిళ ఇండస్ట్రీని తమిళ్ రాకర్స్ ఏ రకంగా వేధిస్తోందో చెప్పడానికి ఇంతకంటే రుజువు లేదు. ఇక ఈ వెబ్ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వస్తోంది. మరీ గొప్ప థ్రిల్లింగ్‌గా లేకపోయినా.. ఎంగేజింగ్‌గానే ఉందని.. ఎనిమిది ఎపిసోడ్లలో ఒక రెండు తగ్గించి ఉంటే క్రిస్ప్‌గా మారేదని అంటున్నారు.

This post was last modified on August 25, 2022 9:28 am

Share

Recent Posts

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

14 minutes ago

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

3 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

4 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

5 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

6 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

6 hours ago