సీనియర్ హీరో రాజశేఖర్ చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత గరుడవేగ సినిమాతో మంచి హిట్ కొట్టి తన అభిమానులకు సంతోషాన్నిచ్చాడు. తన కెరీర్‌కు కాస్త ఊపిరులూదుకున్నాడు. కానీ మంచి క్రేజ్ తెచ్చకున్న ఆయన తర్వాతి సినిమా కల్కి బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. రాజశేఖర్ తర్వాతి చిత్రం శేఖర్ రిలీజవుతుంటే జనాలు పెద్దగా పట్టించుకోలేదు. మలయాళ సూపర్ హిట్ జోసెఫ్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం రిలీజైన సంగతే తెలియకుండా వెళ్లిపోయింది.
సినిమాకు అంత మంచి టాక్ ఏమీ రాలేదు. పైగా ఏదో ఆర్థిక వివాదం కారణంగా షోలు ఆగిపోవడం, మళ్లీ షోలు పడేసరికి జనం పట్టించుకోకపోవడంతో రాజశేఖర్ ఖాతాలో మరో డిజాస్టర్ జమ అయింది. ఈ సినిమా తర్వాత నిరాశలో కూరుకుపోకుండా రాజశేఖర్ త్వరగానే తన తర్వాతి చిత్రాన్ని పట్టాలెక్కించేశాడు. ఆయన కొత్త చిత్రం పేరు.. మాన్‌స్టర్.
ప్రేమ ఇష్క్ కాదల్ లాంటి మంచి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయి.. ఆ తర్వాత సావిత్రి సినిమాతో చేదు అనుభవం ఎదుర్కొన్న పవన్ సాధినేని ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. సావిత్రి దెబ్బకు పవన్ కెరీర్లో బాగా గ్యాప్ వచ్చింది. నందమూరి కళ్యాణ్ రామ్-హరికృష్ణ కలయికలో ఓ సినిమా చేయాలనుకున్నా అది వర్కవుట్ కాలేదు. చివరికి ఆహా కోసం ఓ తమిళ చిత్రాన్ని సేనాపతి పేరుతో రీమేక్ చేశాడు.
దానికి ఓ మోస్తరు స్పందన వచ్చింది. ఇప్పుడతను రాజశేఖర్‌తో జట్టు కడుతున్నాడు. మాన్‌స్టర్ అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారంటే ఇది యాక్షన్ మూవీనే అయ్యుండొచ్చు. మరి ఇదైనా స్ట్రెయిట్ మూవీనా.. లేక రాజశేఖర్ మళ్లీ రీమేక్‌నే నమ్ముకున్నారా అన్నది తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి తమిళ సంగీత దర్శకుడు జిబ్రాన్ మ్యూజిక్ అందించనున్నాడు. గతంలో సూర్య వెర్సస్ సూర్య, శౌర్య లాంటి చిత్రాలు నిర్మించిన మాల్కాపురం శివకుమార్ మాన్‌స్టర్‌తో టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు.
This post was last modified on August 24, 2022 12:46 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…