అవతార్.. 13 ఏళ్ల కిందట వరల్డ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమా. అప్పటి ప్రపంచ చలనచిత్ర కలెక్షన్ల రికార్డులన్నింటినీ అది తుడిచిపెట్టేసింది. తర్వాత కూడా చాలా ఏళ్ల పాటు ఆ రికార్డులు కొనసాగాయి. టికెట్ల ధరలు పెరగడం, వైడ్ రిలీజ్ వల్ల ఆ తర్వాత వేరే చిత్రాలు దాన్ని దాటగలిగాయి కానీ.. అప్పటి లెక్కల్లో చూస్తే ‘అవతార్’ ఇప్పటికీ నంబర్ వన్ సినిమా అనడంలో సందేహం లేదు. ఈ మెగా మూవీకి ఇంకో మూడు సీక్వెల్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
అందులో తొలి సీక్వెల్ ఈ ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఐతే ఫస్ట్ పార్ట్ రిలీజై 13 ఏళ్లు అయిపోతోంది. సీక్వెల్ చూడాలంటే ముందు రివిజన్ అవసరం. అది టీవీల్లో, మొబైళ్లలో చూస్తే కిక్కుండదు. మళ్లీ వెండితెరపై ‘అవతార్’ వీక్షణం.. ఆ సినిమా ప్రియులందరికీ అవసరం. ఆ అవసరాన్ని గుర్తించే సెప్టెంబరు 23 నుంచి ఇండియా వైడ్ రెండు వారాల పాటు ‘అవతార్’ను థియేటర్లలో ప్రదర్శించబోతున్నారు.
రీ రిలీజ్ అంటే ఏదో నామమాత్రంగా కాకుండా పెద్ద ఎత్తునే ఉండబోతోంది. అన్ని ప్రధాన మల్టీప్లెక్సులూ దీనికి పెద్ద ఎత్తున షోలు కేటాయించబోతున్నాయి. 13 ఏళ్ల కిందట ‘అవతార్’ చూసినప్పటి కంటే ఇప్పుడు ఇంకా గొప్ప అనుభూతి ఉండబోతోంది. ఆ ప్రింట్‌ను రీమాస్టర్ చేసి 4కే రెజొల్యూషన్లో, ఇంకా బెటర్ సౌండ్‌లో సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
సినిమాను త్రీడీలోనే చూపించబోతున్నారు. ఐమాక్స్ స్క్రీన్లలో 4కే రెజొల్యూషన్లో, అదిరిపోయే సౌండ్‌తో, త్రీడీలో సినిమా చూస్తే కలిగే అనుభూతే వేరుగా ఉంటుందనడంలో సందేహం లేదు. ‘అవతార్-2’ చూడబోయే ముందు ఇది ఇచ్చే కిక్కే వేరుగా ఉంటుంది. ఇలా సినిమా చూశాక పర్ఫెక్ట్ మూడ్ క్రియేటవుతుంది కూడా. అప్పుడు ‘అవతార్-2’ మీద అంచనాలు ఇంకా పెరిగిపోతాయి. ఏ సినిమా చేసినా ఒక యజ్ఞంలా చేసే జేమ్స్ కామెరూన్.. టైటానిక్ లాంటి కల్ట్ బ్లాక్‌బస్టర్ తర్వాత 11 ఏళ్లు గ్యాప్ తీసుకుని ‘అవతార్’ చేశాడు. ఆ తర్వాత 13 ఏళ్లు అవతార్-2 కోసం వెచ్చించాడు. ఈ సారి మరింతగా ఆయన బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on August 24, 2022 10:23 am
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…