మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు ఎలాంటెలాంటి సినిమాలు చేశారు.. ఎలాంటి హిట్లు కొట్టారు.. ఎలా బాక్సాఫీస్‌ను షేక్ చేశారు.. దశాబ్దాల పాటు ఎలా నంబర్ వన్ హోదాలో ఇండస్ట్రీని ఏలారు.. ఎంతమందికి స్ఫూర్తిగా నిలిచారు అన్నది ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నంబర్ వన్ స్థానంలో ఉండగానే సినిమాల నుంచి తప్పుకుని రాజకీయాల్లోకి వెళ్లిపోవడం అప్పట్లో అభిమానులను బాధించింది. రాజకీయాల్లో ఫెయిలవడం కూడా వారిని బాధ పెట్టినా కొన్నేళ్ల తర్వాత తిరిగి సినిమాల్లో వస్తున్నందుకు ఎంతో సంతోషించారు.
ఐతే రీఎంట్రీ తర్వాత చిరు అభిమానుల ఆకాంక్షలకు తగ్గ సినిమాలైతే చేయట్లేదన్నది అందరూ అంగీకరించే విషయం. ఒక రీమేక్ మూవీతో రీఎంట్రీ ఇవ్వడమే అసలు చాలామందికి రుచించలేదు. కాకపోతే ఆయన పునరాగమనం మీద ఆసక్తితో ‘ఖైదీ నంబర్ 150’ని బ్లాక్‌బస్టర్ చేశారు. ఆ తర్వాత చేసిన భారీ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ ప్రేక్షకులకు సంతృప్తిని ఇవ్వలేకపోయింది. అది బాక్సాఫీస్ దగ్గర బాగానే ఆడినప్పటికీ.. బడ్జెట్ ఎక్కువవడం వల్ల కాస్ట్ ఫెయిల్యూర్ అయింది. ‘సైరా’ సినిమా అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ.. రిలీజ్ ముంగిట దానికి మంచి హైపే వచ్చింది.
అందుక్కారణాలు.. అది స్ట్రెయిట్ మూవీ కావడం, దాని భారీతనం, ఆ చిత్రాన్ని రూపొందించింది సురేందర్ రెడ్డి కావడం. చిరు ఆ తర్వాత చేస్తున్న సినిమాలతో ఇలా ఆసక్తిని రేకెత్తించలేకపోతున్నారన్నది వాస్తవం. సామాన్య ప్రేక్షకుల సంగతి పక్కన పెడితే అభిమానుల్లోనే ఆయన ఛాయిస్‌ల పట్ల తీవ్ర అసంతృప్తి ఉంది. మొదలైనపుడు ఎంతో ఆసక్తి రేకెత్తించిన ‘ఆచార్య’.. రిలీజ్ ముంగిట క్రేజ్ పోగొట్టుకుంది. ఇక సినిమా దారుణంగా ఉండడంతో బాక్సాఫీస్ దగ్గర దానికి ఘోర పరాభవం ఎదురైంది. ఇది చిరు అభిమానులను చాలా కాలం వెంటాడే గాయం అనడంలో సందేహం లేదు.
ఇక దీని తర్వాత చిరు లైనప్ చూసి వాళ్లు మరింత బాధ పడుతున్నారు. రీమేక్‌ల పట్ల అంతకంతకూ ఆసక్తి తగ్గిపోతున్న టైంలో లూసిఫర్, వేదాళం లాంటి రొటీన్ మాస్ సినిమాలను చిరు రీమేక్ చేస్తుండడంతో ఎవ్వరిలోనూ ఎగ్జైట్మెంట్ కనిపించడం లేదు. చిరు పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ‘గాడ్ ఫాదర్’ టీజర్, ‘భోళా శంకర్’ రిలీజ్ డేట్ పోస్టర‌్లకు వచ్చిన స్పందన, సోషల్ మీడియాలో కామెంట్లు చూస్తే చిరు అభిమానులకే వీటిపై అంత ఆసక్తి లేదని స్పష్టమవుతోంది.
వీటి తర్వాత బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా పరిస్థితి కొంచెం మెరుగే కానీ.. బాబీ ట్రాక్ రికార్డు చూసి దాని విషయంలోనూ సందేహాలతోనే ఉన్నారు ఫ్యాన్స్. ఓవైపు కమల్ హాసన్, మోహన్ లాంటి సీనియర్ నటులు వయసుకు తగ్గ పాత్రల్లో, ప్రయోగాత్మక కథల్లో అద్భుతాలు చేస్తుంటే చిరు మాత్రం ఇంకా కమర్షియల్ లెక్కలేసుకుని రీమేక్‌లు, రొటీన్ మాస్ మసాలా సినిమాలు చేస్తుండటం పట్ల చిరు జెన్యూన్ ఫ్యాన్స్ ఆనందంగా లేరన్నది వాస్తవం. చిరు పుట్టిన రోజు సందర్భంగా ఆయన మీద అభిమానాన్ని చాటుతూనే తను ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో తమ అసంతృప్తిని చాలామంది వెళ్లగక్కారు సోషల్ మీడియాలో. ఈ ఫీడ్ బ్యాక్ చూసి చిరు మున్ముందు అయినా రూటు మార్చాల్సిన అవసరం ఉందన్నది స్పష్టం.
This post was last modified on August 23, 2022 3:39 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…