అభిషేక్ అగర్వాల్.. ఇప్పుడు టాలీవుడ్లోనే కాక ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తంలో మార్మోగుతున్న పేరు. చిన్న, మీడియం రేంజ్ సినిమాలు తీసే ఈ నిర్మాత ఈ ఏడాది కొన్ని నెలల వ్యవధిలో రెండు భారీ విజయాలందుకున్నాడు. అందులో ఒకటి ‘ది కశ్మీర్ ఫైల్స్’ కాగా.. మరొకటి ‘కార్తికేయ-2’. ఈ రెండు చిత్రాలకు ముందు ఆయన కెరీర్లో అంతగా విజయాలు లేవు. ‘గూఢచారి’ మినహా అభిషేక్ నిర్మించిన సినిమాలన్నీ తీవ్రంగా నిరాశ పరిచాయి. కిరాక్ పార్టీ, సీత, ఎ-1 ఎక్స్‌ప్రెస్ లాంటి ఫ్లాపులు ఎదుర్కొన్నారాయన.
ఇలాంటి ట్రాక్ రికార్డుతో ఇండస్ట్రీలో చాలా రోజులు నిలవడం అంటే కష్టమే. కానీ హిందీలో తక్కువ బడ్జెట్లో ఆయన నిర్మించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా అద్భుతాలు చేసింది. విడుదలయ్యే ముందు పెద్దగా అంచనాలే లేని ఈ చిత్రం.. పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే బాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్లలో ఒకటిగా నిలిచింది. కేవలం రూ.25 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఆ సినిమా ఏకంగా రూ.340 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం.
ఈ సినిమాతో అభిషేక్ అగర్వాల్ పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఈ విజయంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న అభిషేక్‌కు ఇప్పుడు ‘కార్తికేయ-2’ రూపంలో మరో జాక్‌పాట్ తగిలింది. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి.జి.విశ్వప్రసాద్‌తో కలిసి నిర్మించాడు అభిషేక్. చిత్రీకరణ ఆలస్యం కావడంతో, విడుదల పలుమార్లు వాయిదా పట్టి ఎట్టకేలకు గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కార్తికేయ-2’ బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తోంది. వారం తిరిగేసరికి పెట్టుబడి మీద రెట్టింపు షేర్ తెచ్చిపెట్టింది. రెండో వారంలోనూ సినిమా హౌస్ ఫుల్స్‌తో రన్ అవుతోంది.
హిందీలో కేవలం 50 షోలతో మొదలైన ఈ చిత్రం ఇప్పుడు 3 వేలకు పైగా షోలతో నడుస్తోంది. లాల్ సింగ్ చడ్డా, రక్షా బంధన్ లాంటి పెద్ద సినిమాలను వెనక్కి నెట్టి చక్కటి వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా ఫుల్ రన్ వసూళ్లు వంద కోట్లకు చేరువ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సినిమా అంత స్ట్రాంగ్‌గా సాగుతోంది. అభిషేక్‌కు ఘనవిజయాలందించిన ది కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ-2 చిత్రాలు రెండింట్లోనూ ‘హిందూ ప్రో’ యాంగిల్ ఉండడం ప్లస్ పెద్ద ప్లస్ కావడం గమనార్హం.
This post was last modified on August 22, 2022 1:27 pm
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…
ఏపీలో కూటమి సర్కారు అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం రికార్డ్ సృష్టించింది. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం…
అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…