Movie News

ఒక రోజు లేటుగా లైగర్

ఎప్పుడో మూడేళ్ల కిందట పట్టాలెక్కిన సినిమా ‘లైగర్’. కొవిడ్ సహా రకరకాల కారణాల వల్ల ఈ సినిమా మేకింగ్ ఆలస్యమైంది. షూటింగ్ పూర్తయ్యాక పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్లకు కూడా బాగా టైం తీసుకున్నారు. పలుమార్లు రిలీజ్ డేట్ మారింది. ఎట్టకేలకు ఈ చిత్రం రాబోయే గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో బహు భాషల్లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే.

ఐతే ప్రధానంగా ఫోకస్ ఉన్నది తెలుగు, హిందీ భాషల మీదే. ఐతే ఈ రెండు భాషల్లో రిలీజ్ విషయంలో చిత్ర బృందం భిన్నమైన వ్యూహాన్ని అనుసరించబోతోంది. తెలుగు వెర్షన్ అనుకున్నట్లే 25న ఉదయం థియేటర్లలోకి దిగుతుండగా.. హిందీ వెర్షన్‌కు మాత్రం రెగ్యులర్ రిలీజ్ 26న ఉండబోతోంది. 25న రాత్రి సెకండ్ షోకు పెయిడ్ ప్రిమియర్లు వేయబోతున్నారు. తర్వాతి రోజు నుంచి రెగ్యులర్ షోలు నడుస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే హిందీ వెర్షన్ ఒక రోజు లేటుగా రిలీజవుతున్నట్లే.

ఇలా ఎందుకు చేస్తున్నారనే విషయంలో క్లారిటీ లేదు. బహుశా హిందీ చిత్రాలకు శుక్రవారం సెంటిమెంట్ ఎక్కువ కాబట్టి ఇలా చేస్తున్నారేమో. అలాగే ఇది మాస్ మూవీ కాబట్టి నెగెటివ్ రివ్యూలు వస్తాయేమో అన్న డౌట్‌తోనూ ఇలా చేస్తుండొచ్చు. కానీ ‘లైగర్’కు బుధవారం రాత్రే యుఎస్‌లో ప్రిమియర్స్ పడుతున్నాయి. అక్కడ ప్రిమియర్లు వేసేది తెలుగు వెర్షన్‌కే అయినా టాక్ ముందే బయటికి వచ్చేస్తుంది.

హిందీలో ఈ చిత్రం పెద్ద ఎత్తునే రిలీజవుతుండడంతో అక్కడి ప్రేక్షకులు తెలుగు రివ్యూలు చూడకుండా ఉండరు. కాబట్టి టాక్‌ స్ప్రెడ్ అవుతుందన్న ఉద్దేశంతో సినిమాను ఆలస్యం చేయడంల లాజిక్ కనిపించదు. ‘లైగర్’లో బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్మాణ భాగస్వామి కావడంతో హిందీలో దీనికి పెద్ద రిలీజే ఉండబోతోంది. అక్కడ సినిమాపై ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ‘లైగర్’కు ఉదయం 7 గంటల నుంచే షోలు పడే అవకాశాలు ఉన్నాయి.

This post was last modified on August 21, 2022 2:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అల్లరోడికి పరీక్ష : 1 అవకాశం 3 అడ్డంకులు!

పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…

12 minutes ago

ఇలాగైతే తెలంగాణలో ఆంధ్ర వాళ్ళకు ఇబ్బందులే..

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…

28 minutes ago

వైసీపీని ఎవ‌రు న‌మ్ముతారు.. రెంటికీ చెడుతోందా..!

వైసీపీ తీరు మార‌లేదు. ఒక‌వైపు.. ఇండియా కూట‌మిలో చేరేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్న‌ట్టు ఆ పార్టీ కీల‌క నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు…

3 hours ago

బైడెన్ వ‌ర్సెస్ ట్రంప్‌.. న‌లిగిపోతున్న విదేశీయులు!

అగ్ర‌రాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న ప‌రిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణుల‌ను ఇర‌కాటంలోకి నెడుతున్నాయి. మ‌రో రెండు మూడు వారాల్లోనే…

12 hours ago

ఆ ఖైదీ జైలు శిక్ష‌ ఫిఫ్టీ-ఫిఫ్టీ.. భార‌త్‌, బ్రిట‌న్ ఒప్పందం!

జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చ‌ర్యం అంద‌రికీ క‌లుగుతుంది. కానీ, ఇది వాస్త‌వం. దీనికి సంబంధించి…

13 hours ago