సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థలో తెరకెక్కుతున్న ఓ సినిమా మధ్యలో ఆగిపోయి.. ముందుకు కదలని పరిస్థితి చేరుకుంది. ఇప్పటిదాకా పెట్టిన ఖర్చంతా వృథా అయినా పర్వాలేదని ఆ సినిమాను పక్కన పెట్టేసినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఆ చిత్రమే.. మలయాళ హిట్ ‘కప్పెలా’ రీమేక్. రెండేళ్ల కిందట మలయాళంలో పెద్ద విజయం సాధించిన చిత్రాల్లో ‘కప్పెలా’ ఒకటి. తక్కువ మంది నటీనటులతో, పరిమిత లొకేషన్లలో చాలా చిన్న ఖర్చులో తెరకెక్కిన ఈ సినిమా.. బడ్జెట్ మీద కొన్ని రెట్ల లాభాలు తెచ్చిపెట్టింది. స్టన్నింగ్‌గా ఉండే క్లైమాక్స్ ఈ చిత్రానికి పెద్ద ఎసెట్. ఈ చిత్రం విడుదలైన కొన్ని రోజులకే అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ రీమేక్ హక్కులు తీసుకుంది. సుకుమార్ అసిస్టెంట్ అయిన శౌరీ చంద్రశేఖర్ దర్శకత్వంలో ఈ సినిమాను మొదలుపెట్టింది.
ఒరిజినల్లో రోషన్ మాథ్యూ చేసిన సెన్సేషనల్ క్యారెక్టర్‌కు తెలుగులో సిద్ధు జొన్నలగడ్డను అనుకున్నారు. శ్రీకాంత్ భాసి చేసిన పాత్రకు తమిళ నటుడు అర్జున్ దాస్‌ను ఎంచుకున్నారు. తమిళంలో విశ్వాసం, ఎన్నై అరిందాల్ చిత్రాల్లో బాల నటిగా కనిపించిన అనైకను కథానాయికగా తీసుకున్నారు. ఐతే సిద్ధు అప్పటికి ‘డీజే టిల్లు’ పనిలో బిజీగా ఉండడంతో అతడితో సంబంధం లేని సన్నివేశాలు చిత్రీకరించారు. షూటింగ్ సగానికి పైగా పూర్తయింది.
చివరికి ఈ చిత్రానికి డేట్లు కేటాయించాల్సిన స్థితిలో సిద్ధు అడ్డం తిరిగాడు. ‘డీజే టిల్లు’తో తన ఇమేజ్ పూర్తిగా మారిపోవడంతో ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేయొద్దని అతను నిర్ణయించుకున్నాడు. సితార వాళ్లు ఎంత నచ్చజెప్పినా ఒప్పుకోలేదు. దీంతో సినిమాకు అక్కడ బ్రేక్ పడిపోయింది. వేరే ఆప్షన్లు కొన్ని ప్రయత్నించినా వర్కవుట్ కాలేదు. తర్వాతేమో త్రివిక్రమ్ దగ్గర కోడైరెక్టర్‌గా పనిచేసే వ్యక్తి కొడుకును ఈ పాత్రకు తీసుకోవాలనుకున్నారు.
కానీ ఆల్రెడీ అనైక, అర్జున్ దాస్ తెలుగు వారికి అంతగా పరిచయం లేదు. ఇంకో ముఖ్య పాత్రకు కూడా కొత్త నటుణ్ని తీసుకుంటే సినిమాకు అప్పీల్ అన్నదే ఉండదు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక సినిమాను పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. మరి సినిమాను తిరిగి పట్టాలెక్కించి పూర్తి చేస్తారా.. అలాగే వదిలేస్తారా అన్నది తెలియడం లేదు. ఒక వేళ పున:ప్రారంభించినా తక్కువ మొత్తానికి ఓటీటీకి ఇచ్చేయడం తప్పితే ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని థియేటర్లలో రిలీజ్ చేసే సాహసం చేయకపోవచ్చని అంటున్నారు.
This post was last modified on August 21, 2022 2:28 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…