వంద, రెండొందల కోట్ల వసూళ్లు సాధించిన చిత్రాలు కూడా డిజాస్టర్లు అవుతుంటాయి కొన్నిసార్లు. వాటి మీద బడ్జెట్ కూడా వందల కోట్లు పెట్టినపుడు వందల కోట్లలో వచ్చే వసూళ్లు దిగదుడుపుగానే అనిపిస్తాయి. సాహో, రాధేశ్యామ్ చిత్రాలు అందుకు ఉదాహరణ. సినిమా సక్సెస్‌ను ఎప్పుడూ పెట్టుబడి-రాబడి కోణంలోనే లెక్కగట్టాలి. నిర్మాత ఎంత పెట్టాడు.. ఎంత వచ్చింది? డిస్ట్రిబ్యూటర్లు సినిమాను ఎంతకు కొన్నారు.. వాళ్లకు ఎంత వచ్చింది? ఈ కోణంలో చూస్తే ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్లలో ఒకటిగా ‘బింబిసార’ను చెప్పాలి.
ఈ చిత్ర థియేట్రికల్ హక్కులను రూ.15 కోట్లకే అమ్మాడు నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్. సినిమాకు కొంచెం ఎక్కువ బడ్జెట్టే అయినప్పటికీ.. కొన్ని ఏరియాల వరకు తన సొంత డిస్ట్రిబ్యూటర్లకు సినిమాను ఇచ్చి మిగతా ఏరియాలను అమ్మేశాడు. సినిమాకున్న డిమాండ్‌కు తగ్గట్లే అమ్మకాలు జరిగాయే తప్ప.. బడ్జెట్‌ను అనుసరించి మరీ ఎక్కువ రేట్లేమీ చెప్పలేదు.
ఇప్పుడీ సినిమా బయ్యర్ల పెట్టుబడి మీద రెట్టింపు కన్నా ఎక్కువ వసూలు చేయడం విశేషం. రెండు వారాల వ్యవధిలో ‘బింబిసార’ వరల్డ్ వైడ్ షేర్ రూ.32 కోట్లను దాటిపోయింది. అంటే ఇప్పటికే ఈ చిత్రం డబుల్ బ్లాక్‌బస్టర్ అయిందన్నమాట. నైజాం ఏరియాలో దిల్ రాజు ఐదున్నర కోట్లకు కొంటే ఇప్పటికే అక్కడ షేర్ రూ.10 కోట్ల మార్కును దాటేసింది. సీడెడ్లో రూ.6.8 కోట్ల షేర్ రాబట్టిన బింబిసార.. వైజాగ్‌లో రూ.4.5 కోట్ల దాకా కొల్లగొట్టింది.
ఆంధ్రాలోని మిగతా అన్ని ఏరియాల్లో కలిపి ఇంకో ఏడు కోట్ల దాకా షేర్ వచ్చింది. యుఎస్‌లో ఈ చిత్రం హాఫ్ మిలియన్ మార్కును దాటింది. ఈ వసూళ్లు గురువారం వరకే. ఇప్పటికీ వసూళ్లు నిలకడగా ఉన్నాయి. మూడో వీకెండ్లో కూడా ఈ చిత్రం మంచి షేర్ రాబట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఫుల్ రన్లో ‘బింబిసార’ రూ.40 కోట్ల షేర్ మార్కును అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దీన్ని బట్టి ఈ చిత్రం ఎంత పెద్ద హిట్టో అంచనా వేయొచ్చు.
This post was last modified on August 19, 2022 7:03 pm
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…