కోలీవుడ్ సూపర్ స్టార్ వక్రమ్.. తన కొడుకు ధ్రువ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ధ్రువ్ గత ఏడాది అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్య వర్మతో హీరోగా పరిచయం అయ్యాడు. సోలో హీరోగా అతడి రెండో సినిమా ఇంకా ఖరారే కాలేదు. ఈలోపే తండ్రితో కలిసి మల్టీస్టారర్ చేయడానికి రెడీ అయిపోయాడతను. యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ వీళ్లిద్దరినీ తెరపై చూపించబోతున్నాడు.
అతను విక్రమ్‌తో ఓ సినిమా\ చేయబోతున్నాడని.. ధ్రువ్ అందులో అతిథి పాత్ర చేస్తాడని కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే ఈ సినిమాలో వీరి పాత్రలు రివర్స్ అన్నది తాజా సమాచారం. ఇది విక్రమ్ సినిమా కాదట. ధ్రువ్ మూవీ అట. ఇందులో అతనే హీరో అట. విక్రమ్ అతడిని ఢీకొట్టే విలన్ పాత్రలో కనిపించనున్నాడట.
ఇంతకుముందు హీరోగా మంచి స్థాయిలో ఉండగానే రావణన్ (విలన్) సినిమాలో విలన్ పాత్ర చేశాడు విక్రమ్. ఇప్పుడు అతను కొడుకు సినిమాలో విలన్‌గా కనిపిస్తాడంటే ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొనడం ఖాయం. ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్.. ధనుష్ హీరోగా తీసిన జగమే తంత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.
థియేటర్లు పునఃప్రారంభం కాగానే ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది. పరిస్థితులు మామూలు స్థాయికి రాగానే ధ్రువ్-విక్రమ్ సినిమాను మొదలుపెట్టనున్నాడు. విక్రమ్ ప్రస్తుతం కోబ్రాతో పాటు మహావీర్ కర్ణ, పొన్నియన్ సెల్వన్ లాంటి క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడు. ధ్రువ్-విక్రమ్-కార్తీక్ సినిమా ప్రి లుక్ పోస్టర్‌ను బట్టి చూస్తే ఇది పక్కా యాక్షన్ మూవీ అని అర్థమవుతోంది.
This post was last modified on July 4, 2020 8:23 am
జగన్ హయాంలో అనేక తప్పులు జరిగాయని సీఎం చంద్రబాబు చెప్పారు. అయితే.. మరీ ముఖ్యంగా కొన్ని తప్పుల కారణంగా.. రాష్ట్రం…
సూర్య ప్యాన్ ఇండియా మూవీ కంగువాకు బాక్సాఫీస్ వద్ద వస్తున్న స్పందన చూసి అభిమానులు సంతోషంగా లేరన్నది ఓపెన్ సీక్రెట్.…
కాపు ఉద్యమ మాజీ నాయకుడు, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం.. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్రంలో…
వైసీపీ హయాంలో పవిత్రమైన, గౌరవప్రదమైన అధ్యాపక వృత్తిలో ఉన్న తమను పాఠశాలల్లో మరుగుదొడ్ల పర్యవేక్షణకు, మద్యం షాపుల దగ్గర విధులకు…
వైసీపీ హయాంలో అనుకున్న దానికన్నా రాష్ట్రంలో విధ్వంసం ఎక్కువగానే జరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. 2019లో ఒక్క ఛాన్స్ పేరుతో…
ఏపీలో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో ఎన్డీఏ కూటమి ఎంపీలు కీలక…