మిల్కీ బ్యూట్ తమన్నా సినీ ప్రయాణంలో అప్పుడే దశాబ్దంన్నర పూర్తయింది. ఇంకా ఆమె వయసు చూస్తే 30 ఏళ్లే. 15 ఏళ్లకే హీరోయిన్‌గా అరంగేట్రం చేసి.. 20 ఏళ్ల లోపే స్టార్ ఇమేజ్ తెచ్చుకుందామె. గత కొన్నేళ్లలో కథానాయికగా జోరు తగ్గినప్పటికీ.. ఆమె కెరీర్ మరీ ఇబ్బందికరంగా అయితే ఏమీ లేదు. ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి.
ప్రస్తుతం ఆమె గోపీచంద్ సరసన ‘సీటీమార్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే షూటింగులకు బ్రేక్ రావడంతో తమన్నా కొంత కాలంగా ఖాళీగా ఉంటోంది. ఇలాంటి సమయంలోనే తమన్నాకు ఓ టాక్ షోకు హోస్ట్‌గా ఎంపిక కావడం విశేషం. అల్లు వారి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ‘ఆహా’ కోసం రూపొందుతున్న టాక్ షో అది. త్వరలోనే ఆరంభ ఎపిసోడ్ల చిత్రీకరణ జరగబోతోంది. తొలి ఎపిసోడ్లో రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇద్దరూ పాల్గొనబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.
మరి ఈ షోకు తమన్నా తీసుకునే పారితోషకం ఎంత అనే చర్చ నడుస్తోంది ఇండస్ట్రీలో. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎపిసోడ్‌కు రూ.8 లక్షల చెప్పున ఆమెకు రెమ్యూనరేషన్ ఫిక్స్ చేశారట. ఇది మరీ ఎక్కువ మొత్తం కాదు. అలాగని తక్కువా కాదు. తమన్నాకు ప్రస్తుతమున్న డిమాండ్ ప్రకారం చూస్తే ఇది రీజనబుల్ అమౌంటే.
ఓ సినిమాకు అటు ఇటుగా నెల రోజులకు అటు ఇటుగా కాల్ షీట్లు ఇచ్చే తమన్నా.. కోటి కోటిన్నర మధ్య పారితోషకం తీసుకుంటోంది. ఆహా టాక్ షో కోసం రోజుకొక్క ఎపిసోడ్ చొప్పున 30 రోజులు పని చేస్తే రూ.2.4 కోట్ల దాకా ముడుతుందన్నమాట. ఈ లెక్కన చూస్తే తమన్నాకు పెద్ద మొత్తంలోనే అందుతున్నట్లే. ఐతే సినిమా షూటింగ్‌లతో పోలిస్తే దీనికి కష్టం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ సమయం పని చేయాల్సి ఉంటుంది. తమన్నా ద్వారా షోకు చేకూరే ప్రయోజనమూ తక్కువ కాదు. కాబట్టి ఈ డీల్ ఉభయతారకం అన్నట్లే.
This post was last modified on July 3, 2020 10:33 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…