వరుణ్ తేజ్ వెయిటింగ్ గేమ్

ఎన్నో ఆశలు పెట్టుకుని ఒళ్ళు హూనం చేసుకుని సిక్స్ ప్యాక్ ట్రై చేసి మరీ నటించిన గని డిజాస్టర్ కావడం వరుణ్ తేజ్ ని బాగా డిస్టర్బ్ చేసింది. తన కష్టాన్ని గుర్తించెందుకైనా కనీస స్థాయిలో ఆడకపోవడం ఫ్యాన్స్ ని సైతం ఫీలయ్యేలా చేసింది. ఎఫ్3 కమర్షియల్ గా బాగానే పే చేసినా ఆ సక్సెస్ షేర్ వెంకటేష్, అనిల్ రావిపూడితో పాటు ఇతర క్యాస్టింగ్ తో పంచుకోవాల్సి రావడంతో వరుణ్ కు ప్రత్యేకంగా మిగిలిన ఆనందమేమీ లేదు. కాకపోతే నత్తి క్యారెక్టర్ లో కామెడీని ఎఫ్2 కంటే బాగానే పండించాడనే పబ్లిక్ టాక్ మంచి కాన్ఫిడెన్స్ ని ఇచ్చింది

ఇదంతా వరుణ్ తేజ్ వేగంగా సినిమాలు చేయడానికి సరిపడనంత బూస్ట్ ఇవ్వనట్టుగా కనిపిస్తోంది. ఆ మధ్య దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో ఓ ప్రాజెక్ట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అతను నాగార్జున ఘోస్ట్ తాలూకు పనుల్లో బిజీగా ఉండటంతో ఇంకో నెల దాకా ఖాళీ అయ్యే పరిస్థితి లేదు. అయితే దాని ఫలితం చూశాక అప్పుడు నిర్ణయం తీసుకునే దిశగా వరుణ్ ఆలోచిస్తున్నట్టు ఇన్ సైడ్ మెగా టాక్. అది ఒకవేళ కన్ఫర్మ్ అయినా ఇంకో కమిట్ మెంట్ ఎవరికీ ఇవ్వకపోవడం కేవలం ఆచితూచి అడుగులు వేయడం కోసమేనని అంటున్నారు.

మొత్తానికి వరుణ్ తేజ్ ఇంకొంత కాలం వెయిటింగ్ గేమ్ కంటిన్యూ చేసేలా ఉన్నాడు. అందులోనూ ఫామ్ లో ఉన్న డైరెక్టర్లందరూ ఎవరికి వాళ్ళు బిజీగా ఉన్నారు. సో ఇప్పటికప్పుడు కథలు కానీ కాంబోలు కానీ సిద్ధంగా లేవు. గద్దలకొండ గణేష్ తర్వాత మెగా ప్రిన్స్ కు బాగా గ్యాప్ వచ్చింది. అది గనితో పూడుతుందనుకుంటే ఫలితం రివర్స్ అయ్యింది. ఏడాదికి కనీసం రెండు మూడు సినిమాలు చేయాల్సిన ట్రెండ్ లో 2019 నుంచి 2022 దాకా నాలుగేళ్లకు కలిపి తను చేసినవి కేవలం నాలుగే. అర్జెంట్ గా స్పీడ్ పెంచాల్సిందే.