మహమ్మారి వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ రంగం…ఈ రంగం అన్న తేడా లేకుండా అన్ని రంగాలపై ఈ ప్రాణాంతక వైరస్ పంజా విసిరింది. ముఖ్యంగా సినీ పరిశ్రమపై పిశాచి వల్ల విధించిన లాక్ డౌన్ ప్రభావం తీవ్రంగా పడింది. ఓ వైపు రిలీజ్ కు రెడీ అయిన సినిమాలు ఆగిపోవడంతో…ఓటీటీల్లో కొన్ని సినిమాలు తూతూ మంత్రంగా రిలీజవుతున్నాయి. జూన్ 8 నుంచి నిబంధనలను పాటిస్తూ అరకొర షూటింగులు మొదలయ్యాయి.
అయితే, జూన్ 8కు ముందే లాక్ డౌన్ లోనూ విజయవంతంగా సినిమాలు,షార్ట్ ఫిలింలు తీసిన ఘనత దక్కించుకున్న దర్శకుడు రాంగోపాల్ వర్మ. లాక్ డౌన్ వల్ల షూటింగులు లేక అంతా సతమతమతమవుతోంటే…వర్మ మాత్రం….వరుస సినిమాలు, షార్ట్ ఫిలింలతో దూసుకుపోతున్నాడు. క్లైమాక్స్, నేకెడ్, కరోనా వైరస్ చిత్రాలను తెరకెక్కించిన వర్మ….ఇపుడు తాజాగా హారర్ చిత్రం12 ఓ క్లాక్
ను జనం మీదికి వదలబోతున్నాడు. మరో హారర్ చిత్రంతో జనాన్ని భయపెట్టడానికి వస్తున్నానన్న వర్మ…7 ఓ క్లాక్ కి 12 ఓ క్లాక్
మూవీ టీజర్ రిలీజ్ చేశాడు.
కాంట్రవర్సీని..కరోనాను క్యాష్ చేసుకోవడంలో వర్మ సక్సెస్ అయినంతగా మరెవరూ సక్సెస్ కాలేదంటే అతిశయోక్తి కాదు. లాక్ డౌన్ లో మెరుపువేగంతో సినిమాలు, షార్ట్ ఫిలింలు నిర్మించి, దర్శకత్వం వహించిన వర్మ….తానే డిస్ట్రిబ్యూటర్ గా మారి….విడుదల చేసి సొమ్ముచేసుకుంటున్నాడు. ఇప్పటికే క్లైమాక్స్, నేకెడ్ విడుదల కాగా… కరోనా వైరస్ రిలీజ్ కావాల్సి ఉంది. చాలామంది దర్శకనిర్మాతలు ఓటీటీ ప్లాట్ ఫాంలవైపు చూస్తుంటే…వర్మ మాత్రం తన సినిమాలకు తనే ఆన్ లైన్ లో ‘పే ఫర్ వ్యూ’ విధానంలో విడుదల చేస్తున్నాడు. ’12 ఓ క్లాక్’ (12 O’ CLOCK) అంటూ తనకు అచ్చొచ్చిన హారర్ జోనర్ లో వినూత్న ప్రయోగం చేస్తున్నాడు వర్మ. అయితే, షార్ట్ ఫిల్మ్ నిడివి ఉన్న నేకెడ్ చిత్రానికి ఫుల్ లెంగ్త్ మూవీ రేంజ్ లో వర్మ బిల్డప్ ఇచ్చి భంగపడడంతో నెటిజన్లు…వర్మపై కామెంట్స్ చేశారు.
దీంతో, తన తర్వాతి చిత్రం ’12 ఓ క్లాక్’ విషయంలో క్లారిటీ ఇచ్చాడు వర్మ. ఇది షార్ట్ ఫిలిమ్ కాదని….ఒక గంట 45 నిమిషాల నిడివి ఉన్న సినిమా అని చెప్పాడు వర్మ. అంతేకాదు. ‘రాత్’, ‘భూత్’ వంటి హారర్ చిత్రాలను రూపొందించిన వర్మ నుంచి విడుదలైన 12 ఓ క్లాక్
టీజర్ భయపెట్టేలా ఉంది. వర్మ మార్క్ షాట్ టేకింగ్….జూమ్…నైట్ విజువల్స్…రాత్రి సినిమాను తలపించేలా ఉన్నాయి. లాక్ డౌన్ నేపథ్యంలో సెట్ అయ్యే హారర్ జానర్ ఎంచుకున్న వర్మ…ఓ ఫాం హౌస్ వంటి సెటప్ లో భయం పుట్టిం చే సన్నివేశాలు రూపొందించాడు. మరి, సొంత థియేటర్లో వర్మ ఎంతవరకు భయపెట్టిస్తాడో చూడాలంటే మరి కొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందే.
This post was last modified on July 3, 2020 10:30 pm
కాపు ఉద్యమ మాజీ నాయకుడు, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం.. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్రంలో…
వైసీపీ హయాంలో పవిత్రమైన, గౌరవప్రదమైన అధ్యాపక వృత్తిలో ఉన్న తమను పాఠశాలల్లో మరుగుదొడ్ల పర్యవేక్షణకు, మద్యం షాపుల దగ్గర విధులకు…
వైసీపీ హయాంలో అనుకున్న దానికన్నా రాష్ట్రంలో విధ్వంసం ఎక్కువగానే జరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. 2019లో ఒక్క ఛాన్స్ పేరుతో…
ఏపీలో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో ఎన్డీఏ కూటమి ఎంపీలు కీలక…
ఒక స్టార్ హీరో.. ఇంకో స్టార్ హీరో గురించి మాట్లాడితే అభిమానుల్లో అమితాసక్తి కలుగుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్…
కంగువ విడుదలకు ముందు నిర్మాత జ్ఞానవేల్ రాజా ఓ సందర్భంలో మాట్లాడుతూ తమ సినిమా రెండు వేల కోట్లు వసూలు…