‘కార్తికేయ-2’ విడుదలకు ముందు నిఖిల్ పడ్డ వేదన గురించి అందరికీ తెలిసిందే. తనకు బ్యాగ్రౌండ్ లేకపోవడం వల్ల ఈ సినిమాను మళ్లీ మళ్లీ వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని, రిలీజ్ డేట్ ఇచ్చాక పదే పదే మార్చాల్సి వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశాడతను. కొవిడ్ కారణంగా అసలే ఆలస్యమైన సినిమాను.. జులై 22న రిలీజ్ చేయాలనుకుంటే ‘థాంక్యూ’కు పోటీ అవుతుందని వాయిదా వేయించారు. ఆగస్టు 5 వైపు చూస్తే అక్కడ ఆల్రెడీ రెండు సినిమాలు షెడ్యూల్ అయి ఉండడంతో అవకాశం దక్కలేదు.
చివరికి ఆగస్టు 12న రిలీజ్ అంటూ డేట్ ప్రకటించాక నితిన్ సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’ ఓపెనింగ్స్‌కు ఇబ్బంది అవుతుందని ఒక రోజు వాయిదా వేయించారు. ఈ పరిణామాలు నిఖిల్‌ను ఎంతో ఆవేదనకు గురి చేసినా తట్టుకున్నాడు. ఇదంతా ఇండస్ట్రీ మంచి కోసమే కదా అని మీడియా సమావేశంలో హుందాగా మాట్లాడాడు. ఐతే చివరికి చూస్తే ఇప్పుడు నిఖిల్ సినిమాకు అన్నీ కలిసొస్తుండడం, చివరికి మంచే జరగడం తన అభిమానులను ఆనందానికి గురి చేస్తోంది.
శనివారం ఫుల్ పాజిటివ్ టాక్‌తో మొదలైన ‘కార్తికేయ-2’ రిలీజైన థియేటర్లన్నింట్లో హౌస్ ఫుల్స్‌తో నడుస్తోంది. హైదరాబాద్ సిటీలో శనివారం సాయంత్రం, నైట్ షోలన్నీ ఫుల్ అయిపోయాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో రెండు థియేటర్లలో సినిమాను రిలీజ్ చేస్తే రెండూ ఫుల్లే. మరోవైపు ‘మాచర్ల నియోజకవర్గం’ మూవీ రెండు థియేటర్లలో ఆడుతుండగా ఆక్యుపెన్సీ 25 శాతానికి అటు ఇటుగా ఉంది. పూర్తిగా నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తొలి రోజే దాదాపు బకెట్ తన్నేసిందని చెప్పాలి.
‘కార్తికేయ-2’కు పాజిటివ్ టాక్ రావడం.. గత వారం సినిమాలు కూడా బాగా ఆడుతుండటంతో ప్రేక్షకులు ఈ సినిమాను పట్టించుకోవడం లేదు. ఐతే ముందే థియేటర్లు బుక్ చేయడంతో ‘కార్తికేయ-2’తో పోలిస్తే రెట్టింపు థియేటర్లలో ఆడుతోందీ సినిమా. కానీ ఎంత ముందు బుక్ చేసినా.. వసూళ్లు లేకుండా అన్నేసి థియేటర్లలో సినిమాను నడిపించి ప్రయోజనం ఏంటి? ఓవైపు ‘కార్తికేయ-2’ సినిమాకు డిమాండ్‌కు తగ్గ థియేటర్లు లేవు. దాని కోసం జనం ఎగబడుతున్నారు. ఇంకోవైపేమో ‘మాచర్ల..’ థియేటర్లలో జనం లేరు. అలాంటపుడు కచ్చితంగా ఆ సినిమా థియేటర్లను తీసి ‘కార్తికేయ-2’కు ఇవ్వాల్సిందే. ఆది, సోమవారాలు సెలవులు కావడంతో ‘కార్తికేయ-2’కు మెజారిటీ థియేటర్లు కేటాయిస్తే ఎగ్జిబిటర్లకు మంచి ప్రయోజనం దక్కుతుంది.
This post was last modified on August 14, 2022 12:20 pm
ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ అభిమానులు ఎదురు చూసిన కీలక అప్డేట్ ఓజి 2.…
సోలో హీరోగా దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాతోనూ వంద కోట్లు వసూలు చేయగలడని నిరూపించిన లక్కీ భాస్కర్ కొనసాగింపు…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు సుస్మిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అయితే,…
సెప్టెంబర్ 24 విడుదల కాబోతున్న ప్యారడైజ్ కోసం అభిమానుల ఎదురు చూపుల గురించి ఎంత చెప్పినా తక్కువే. నాని కెరీర్…
ఒకపక్క టాక్సిక్ పుణ్యమాని తెలుగు, కన్నడ మూవీ లవర్స్ సోషల్ మీడియా వేదికగా ఒకరిమీద మరొకరు కామెంట్లు, ట్రోల్స్ చేసుకోవడం…
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని, రెండు మూడు చిన్న సినిమాల అనుభవం ఉన్న హీరోను పెట్టి.. ఒక డెబ్యూ డైరెక్టర్ రూ.3-4…