అదేదో సామెత చెప్పినట్టు పడుకున్న గుర్రాన్ని లేపి మరీ తన్నించుకున్నట్టుంది తాప్సీ కొత్త సినిమా వ్యవహారం. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందిన దొబారా ఈ నెల 19న విడుదల కానుంది. ఇప్పటిదాకా దీని మీద కనీస స్థాయిలో బజ్ లేదు. ఏదో ఒకరకంగా ఈ మూవీని ట్రెండింగ్ లో తేవాలని భావించిన హీరోయిన్ డైరెక్టర్ ఇద్దరూ కలిసి ఓ విచిత్రమైన ప్లాన్ వేశారు.
లాల్ సింగ్ చడ్డాకు బాయ్ కాట్ నినాదం దాన్ని ట్విట్టర్ లో రోజుల తరబడి హాట్ టాపిక్ గా నిలబెట్టిన సంగతి తెలిసిందే. రిలీజ్ కు ముందే చాలా రచ్చ జరిగింది. ఇదే విధంగా తమకూ పబ్లిసిటీ వస్తే బావుంటుందని భావించిన తాప్సీ అనురాగ్ లు ప్లీజ్ ప్లీజ్ దొబారాని కూడా బ్యాన్ చేయమని మాకూ పబ్లిసిటీ అవుతుందని కామెడీ చేయబోయారు. ఇది కాస్తా మిస్ ఫైర్ అయ్యింది.
నెటిజెన్ల మీద వెటకారాలాడతారా అంటూ కొందరు సీరియస్ గా తీసుకున్నారు. మీ కోరికను మన్నిస్తున్నామని చెప్పి గతంలో అనురాగ్ ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ అన్న కామెంట్ల తాలూకు స్క్రీన్ షాట్లను, తాప్సీ వివిధ సందర్భాల్లో ఇచ్చిన కాంట్రావర్సీ స్టేట్ మెంట్లను తీసుకొచ్చి క్యాన్సిల్ దొబారా అంటూ ట్రెండ్ చేసేశారు. దీంతో దెబ్బకు తాము చేసిన పొరపాటు గుర్తించిన ఈ ఇద్దరూ సైలెంట్ అయ్యారు.
అసలే బాలీవుడ్ కు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు వరస డిజాస్టర్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇలాంటి టైంలో జనాన్ని ఎలా ఆకట్టుకోవాలా అనేది వదిలేసి ఫేక్ ప్రమోషన్ల మీద ఆధారపడితే ప్లాన్లు ఇలాగే బూమరాంగ్ లా రివర్స్ కొడతాయి. అక్షయ్ కుమార్ అమీర్ ఖాన్ లకే దిక్కులేక అలో లక్ష్మణా అంటున్నారు. అలాంటప్పుడు తాప్సీ కోసం పరిగెత్తుకుంటూ వస్తారా. ఇటీవలే రిలీజై డిజాస్టర్ కొట్టిన శభాష్ మితు ఏమయ్యిందో అప్పుడే మర్చిపోతే ఎలా?.
This post was last modified on August 13, 2022 6:24 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…