Movie News

పోకిరిని కొట్టేలా.. జల్సా టార్గెట్

మహేష్ అభిమానులు ఇప్పుడు టాలీవుడ్లో అందరు స్టార్ హీరోల ఫ్యాన్స్‌ను కవ్వించి వదిలి పెట్టేశారు. మొన్న మహేష్ బాబు పుట్టిన రోజును పురస్కరించుకుని పోకిరి స్పెషల్ షోలతో వాళ్లు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. హీరోల పుట్టిన రోజులప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్లా కలిపి పదో ఇరవయ్యో స్పెషల్ షోలు వేసుకోవడం మామూలే కానీ.. మహేష్ అభిమానులు మాత్రం ఏకంగా 375 షోల దాకా ప్లాన్ చేశారు. అవన్నీ కూడా దాదాపుగా హౌస్ ఫుల్స్‌తో రన్ అయ్యాయి.

తెలుగు రాష్ట్రాల అవతల బెంగళూరు, చెన్నైలతో పాటు యుఎస్‌లో సైతం ఈ షోలు వేయడం.. అభిమానులు వెర్రెత్తిపోవడం గమనార్హం. ఈ షోల ద్వారా  వరల్డ్ వైడ్ 1.72 కోట్ల గ్రాస్ రావడం కూడా ఒక రికార్డు. షోలు, కలెక్షన్ల విషయంలో ఈ రికార్డులను ఇంకెవరూ కొట్టగలరా అంటూ మహేష్ అభిమానులు సవాలు  విసురుతుండడం గమనార్హం. ఈ సవాలును పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు స్వీకరించినట్లే కనిపిస్తోంది.

సెప్టెంబరు 2న పవన్ పుట్టిన రోజును పురస్కరించుకుని ‘జల్సా’ సినిమా స్పెషల్ షోల కోసం కొన్ని రోజులుగా ప్లానింగ్ జరుగుతోంది. చాలా కష్టపడి 4కే ఫార్మాట్లోకి సినిమాను మార్చారు. ఇందుకోసం ఒక టీం కొన్ని రోజులుగా పని చేస్తోంది. సౌండ్, విజువల్ క్వాలిటీ చాలా బాగా వచ్చిందని, ప్రింట్ అదిరిపోయిందని గీతా ఆర్ట్స్ వర్గాలు అంటున్నాయి. ఈ అప్‌డేట్ బయటికి రాగానే పవన్ అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు.

అభిమాన సంఘాల నాయకులతో పాటు మెగా ఫ్యామిలీ పీఆర్వోలు కూడా రంగంలోకి దిగి షోల ప్లానింగ్‌లో పడిపోయారు. ‘పోకిరి’ రికార్డులను బద్దలు కొట్టడమే లక్ష్యంగా వీళ్ల ప్లానింగ్ నడుస్తున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో, బయట పవన్‌కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అందుకే ‘పోకిరి’ లక్ష్యంగా ఏకంగా 500 షోలకు ప్లానింగ్ జరుగుతున్నట్లు సమాచారం. ఈ షోలన్నీ అనుకున్నట్లుగా పడ్డాయంటే, అభిమానులు కూడా బాగా స్పందించారంటే ‘పోకిరి’ కలెక్షన్ల రికార్డు కూడా ఆటోమేటిగ్గా బద్దలైపోవడం ఖాయం.

This post was last modified on August 13, 2022 2:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అమ‌రావ‌తిలో మోడీ ప్రారంభించిన ప్రాజెక్టులు ఇవే!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న 18 కీల‌క ప్రాజెక్టుల‌కు వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాప‌న‌లు,…

51 minutes ago

పూజాహెగ్డేని ఇలా చూపొద్దన్న ఫ్యాన్స్

బుట్టబొమ్మ అని రామజోగయ్య శాస్త్రి గారు రాసినట్టు ఆ పదానికి న్యాయం చేకూర్చే అందంతో పూజా హెగ్డే కొన్నేళ్ల క్రితం…

52 minutes ago

UPI పేమెంట్.. ఇక నుంచి మరింత వేగంగా..

ఆన్‌లైన్ పేమెంట్ వ్యవహారాలను మరింత సులభతరం చేయడంలో UPI (యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటివరకు ఒక…

2 hours ago

నేను చంద్ర‌బాబును చూసి నేర్చుకున్నాను: మోడీ

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి. ఇది దేవేంద్రుడి రాజ‌ధాని న‌గ‌రం పేరు. దీనిని రాజ‌ధానిగా పెట్టుకున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌.. మ‌రింత అభివృద్దిని సాధించాలి.…

2 hours ago

మూడేళ్ళ గ్యాపుకి న్యాయం జరిగింది

కెజిఎఫ్ విడుదలైన టైంలో హీరోయిన్ శ్రీనిధి శెట్టి దశ తిరిగి పోయిందనే అందరూ అనుకున్నారు. కానీ అవకాశాలు రాలేదో లేక…

2 hours ago

మ‌ళ్లీ సైకిలేసుకుని వ‌చ్చేసిన ఎంపీ!

పార్ల‌మెంటు స‌భ్యుడిగా ఎన్నికైన త‌ర్వాత‌.. నాయ‌కుల్లో మార్పు వ‌స్తుంది. అప్ప‌టి వ‌ర‌కు ఎలా ఉన్నా.. ఎంపీ గా ఉండే ద‌ర్పం,…

2 hours ago