కారణం ఏమైనా కానీ ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా నలుగుతోంది ఊర్వశి రౌతేలా. తన ప్రైవసీ తనకెంత ముఖ్యమో.. ఎదుటోడి ప్రైవసీ కూడా అంతే ముఖ్యమన్న విషయాన్ని మర్చిపోయిన ఆమె.. ఇంటర్వ్యూలో తాను చెప్పిన మాటలకు పడిన పంచ్ కు మరింత నాటుగా రియాక్టు కావటం ఇప్పుడు సంచలనంగా మారింది. అమ్మడిలోని నాటు ఊర్వశి నిద్ర లేవటమే కాదు.. వెనుకా ముందు చూసుకోకుండా వేసిన పంచ్ లు ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తనకు పడిన పంచ్ కు ఘాటు కౌంటర్ ఇచ్చే వరకు నిద్ర పోలేని రీతిలో ఆమె తీరు ఉందని చెప్పాలి.
మొత్తంగా బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా.. క్రికెటర్ రిషబ్ పంత్ ల మధ్య నడుస్తున్న పోస్టుల యుద్ధం తాజాగా ముదిరిపాకాన పడింది. ఇంతకీ అసలీ యుద్ధం ఎక్కడ మొదలైంది? ఎక్కడివరకు వచ్చిందన్న విషయాన్ని చూస్తే.. ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన కోసం ఆర్పీ అనే వ్యక్తి ఎయిర్ పోర్టు వద్ద గంటల తరబడి వేచి చూసినట్లుగా చెప్పుకుంది. ఒక సెలబ్రిటీ కోసం వేరే వారు ఎవరైనా వెయిట్ చేసి ఉంటే.. దాని గురించి కామ్ గా ఉంటే సరిపోతుంది. లేదంటే.. ఒకరుఅని చెబితే సరి. అందుకు భిన్నంగా కాస్తంత క్లూ ఇచ్చి.. అందరి మెదళ్లకు పని పెట్టింది. అలా ఇచ్చిన టాస్కే ఆర్పీ.
తన కోసం ఎయిర్ పోర్టు వద్ద గంటల తరబడి వెయిట్ చేసిన ఆ ప్రముఖుడిని తాను చూడలేదని చెప్పింది. తాను షూటింగ్ కు వెళ్లి అలిసిపోవటంతో జర్నీలో నిద్ర పోయానని.. లేచి చూసేసరికి అతడి నుంచి 16-17 మిస్డ్ కాల్స్ వచ్చినట్లుగా చెప్పింది. ఇంతకీ ఎవరీ ఆర్పీ అంటే.. తాను పేరు చెప్పలేనని చెప్పింది. ఆమె చెప్పకున్నా.. నెటిజన్లు ఊరుకోరు కదా? మొత్తానికి ఆమె నోటి నుంచి వచ్చిన ఆర్పీ టాస్కును దిగ్విజయంగా పూర్తి చేసిన నెటిజన్లు.. అతడెవరోకాదు క్రికెటర్ రిషిబ్ పంత్ గా తేల్చారు.
ఊర్వశి చేసిన కామెంట్ వైరల్ గా మారటంతో రిషబ్ స్పందించాడు. కొంతమంది ఫేమ్ కోసం అబద్ధాలు ఎలా ఆడతారో అర్థం కాదని.. సొంతలాభం కోసం అవతలి వ్యక్తుల్ని ఇబ్బందుల్లో పడేస్తారంటూ మండిపడిన అతడు.. ‘ప్లీజ్ అక్క నన్ను వదిలేయ్’ అంటూ హ్యాష్ టాగ్ తో ఊర్వశికి భారీ కౌంటర్ ఇచ్చారు. దీంతో.. ఊర్వశీ మరింతగా చెలరేగిపోయింది. ఆమెలోని నాటు మనిషి నిద్ర లేచింది. తాజాగా ఇన్ స్టాలో ఆమె ఒక పోస్టు షేర్ చేసింది.
‘ఛోటా భయ్యా నువ్వు బ్యాట్ బాల్ తో ఆడుకో.. నేను మున్నిని కాదు. నీలాంటి పిల్ల బచ్చా వల్ల బద్నాం కావటానికి’ అంటూ మండిపడింది. అంతేకాదు.. తన పోస్టుకు హ్యాష్ ట్యాగులుగా రక్షాబంధన్ శుభాకాంక్షలు.. ఆర్పీ బాటు భయ్యా.. కౌగర్ హంటర్ (తన కంటే ఎక్కువ వయసులో ఉన్న అందమైన అమ్మాయిలతో లైంగిక సంబంధాల్ని కోరుకునే యువకుడు).. డోంట్ టేక్ అడ్వాంటేజ్ఆఫ్ ఏ సైలెంట్ గర్ల్ పెట్టేసింది. దీంతో.. సోషల్ మీడియాలో ఈ ఇద్దరి మధ్య నడుస్తున్న రచ్చ ఇప్పుడు సంచలనంగా మారింది. ఊర్వశీ నాటు పంచ్ కు.. రిషిబ్ పంత్ ఎలా రియాక్టు అవుతారో?
This post was last modified on August 12, 2022 10:25 pm
ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…