పట్టుమని వయసు ఇరవై నిండకుండానే డెబ్యూ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకోవడం హీరోయిన్ల విషయంలో అరుదుగా జరుగుతుంది. ఉప్పెన వచ్చినప్పుడు కృతి శెట్టికి పెరిగిన డిమాండ్ అంతా ఇంతా కాదు. హీరో వైష్ణవ్ తేజ్ కన్నా ఎక్కువగా ఈమె మేనేజర్ కే ఫోన్ కాల్స్ వచ్చాయంటే అతిశయోక్తి కాదు. దెబ్బకు రెండో సినిమా రిలీజ్ కాకుండానే రెమ్యునరేషన్ కోటి దాటిపోయిందని ఆఫ్ ది రికార్డు కామెంట్లు గట్టిగానే వినిపించాయి. అయినా తనకున్న ఇమేజ్ ప్లస్ మార్కెట్ దృష్ట్యా నిర్మాతలు అదేమీ పెద్ద మొత్తమో భారమో అనుకోలేదు.
తర్వాత నానితో చేసిన శ్యామ్ సింగ రాయ్ హిట్ క్యాటగిరీలో పడగా బంగార్రాజు కూడా కమర్షియల్ గా వర్కౌట్ చేసుకుని సంక్రాంతి విజేతగా నిలిచింది. ఇలా విజయవంతంగా హ్యాట్రిక్ హిట్లు పూర్తయ్యాయి. ఇదిలాగే కొనసాగితే బాగుండేది కానీ కృతి శెట్టికి తక్కువ గ్యాప్ లో వరసగా షాకులు తగలడం మొదలయ్యింది. గత నెల భారీ అంచనాల మధ్య వచ్చిన రామ్ ది వారియర్ ఎంత డిజాస్టరో మళ్ళీ గుర్తు చేయాల్సిన పని లేదు. రేడియో జాకీగా కృతి చేసిన క్యారెక్టర్ ని దర్శకుడు లింగుస్వామి సెకండ్ హాఫ్ లో వదిలేయడంతో ప్రయోజనం కలగలేదు
తాజాగా నితిన్ మాచర్ల నియోజకవర్గం కూడా అదే లిస్టులో చేరేలా ఉంది. పాత కథా కథనాలతో దర్శకుడు ఎంఎస్ రాజశేఖర్ ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ని తీర్చిదిద్దిన తీరు విమర్శలను తెచ్చి పెడుతోంది. పైగా వారియర్ లాగే ఇందులోనూ కథకో చిన్న లింక్ తప్ప కృతి శెట్టికి పెద్దగా స్కోప్ దక్కలేదు. సో రెండో షాకు తప్పలేదు. ఇప్పటికే రెండు మూడు సార్లు వాయిదా పడి సెప్టెంబర్ లో రిలీజ్ కానున్న ‘ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా ఏమైనా బ్రేక్ ఇస్తుందేమో చూడాలి. తర్వాత లిస్ట్ లో నాగచైతన్య, సూర్య సినిమాలు సెట్స్ మీదున్నాయి
This post was last modified on August 12, 2022 6:03 pm
కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్కసారిగా పడిపోయింది. వాస్తవానికి గత ఏడాదే ఆయన ప్రజాదరణ తగ్గుముఖం…
టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…
సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…
ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…