Movie News

మెగాస్టార్.. మంచికి పోతే

మెగాస్టార్ చిరంజీవికి కొంత కాలంగా అస్సలు టైం కలిసి రావట్లేదు. రీఎంట్రీలో ‘ఖైదీ నంబర్ 150’తో ఘనవిజయం అందుకున్నప్పటికీ.. ఆ తర్వాత మాత్రం ఆయనకు చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. తన కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేసిన ‘సైరా నరసింహారెడ్డి’ అంచనాలను అందుకోలేకపోయింది. సినిమా బ్యాడ్ అని కాదు కానీ.. అంతిమంగా అది కాస్ట్ ఫెయిల్యూర్ అనిపించుకుంది. ఇక తర్వాతి చిత్రం ‘ఆచార్య’ గురించి చెప్పాల్సిన పనే లేదు.

బాక్సాఫీస్ దగ్గర తన కెరీర్లోనే అత్యంత ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నాడు చిరు. తన సినిమాలు పోవడమే కాక.. చిరు ఎవరికి, ఏ రకంగా సపోర్ట్ చేసినా ఫలితం తిరగబడుతుండటంతో అదే పనిగా సోషల్ మీడియాలో కాచుకుని ఉండే బ్యాచ్‌కు ఆయన దొరికిపోతున్నారు. విపరీతంగా ట్రోల్ అవుతున్నారు. తన స్వార్థం ఏమీ లేకుండా ఇండస్ట్రీ మంచి కోరి ఆయన చేస్తున్న ప్రయత్నాలు కూడా వరుసగా బెడిసి కొడుతుండటం విచారకరం.

తనకు ఎంతో ఇచ్చిన తెలుగు సినీ పరిశ్రమకు మంచి చేద్దామని ప్రకాష్ రాజ్ గత ఏడాది ‘మా’ ఎన్నికల్లో బరిలోకి దిగగా.. ఇందులో తన ప్రయోజనం ఏమీ లేకపోయినా చిరు పరోక్ష మద్దతు ఇచ్చారు. కానీ ఆయన ఓడిపోయారు. చిరు బహిరంగ మద్దతు ఇచ్చి, ప్రచారం చేసి ఉంటే కథ వేరుగా ఉండేదేమో. కానీ తెరవెనుక మద్దతు ఇవ్వడం వల్ల ఆశించిన ఫలితం దక్కలేదు. అక్కడ కట్ చేస్తే.. చిరు పెద్ద మనసుతో వేరే వాళ్ల సినిమాల వేడుకలకు ముఖ్య అతిథిగా రావడం, అలాగే ఏ స్వార్థం లేకుండా ప్రమోట్ చేయడం చేస్తుంటే వాటికీ ఆశించిన ఫలితాలు రావట్లేదు. మిషన్ ఇంపాజిబుల్, పక్కా కమర్షియల్ లాంటి చిత్రాల వేడుకలకు వచ్చి వాటి గురించి చాలా మంచిగా మాట్లాడాడు చిరు.

కానీ అవి దారుణమైన ఫలితాలందుకున్నాయి. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ వ్యక్తిగతంగా అడిగాడని, తన మిత్రుడైన నాగార్జున కొడుకు నాగచైతన్య ఇందులో ప్రత్యేక పాత్ర చేశాడని చిరు పెద్ద మనసుతో ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడమే కాదు.. ఒకటికి రెండుసార్లు స్పెషల్ ప్రిమియర్లలో సినిమా చూశాడు. ఆమిర్‌తో కలిసి స్పెషల్ ఇంటర్వ్యూల్లో పాల్గొన్నాడు. సోషల్ మీడియా ద్వారా ఆ చిత్రాన్ని బాగా ప్రమోట్ చేశాడు. కానీ ఈ సినిమా కూడా బ్యాడ్ టాక్‌తో మొదలై డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తుండటంతో చిరును ఓ వర్గం సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తోంది. 

This post was last modified on August 12, 2022 1:00 pm

Share

Recent Posts

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

10 minutes ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

50 minutes ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

9 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

11 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

11 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

11 hours ago