ఈ మధ్య సినిమాలో విషయంతో సంబంధం లేకుండా వేరే అంశాలతో ముడిపెట్టి కొత్త చిత్రాలను టార్గెట్ చేయడం ఒక ట్రెండ్‌గా మారిపోయింది. తాజాగా ఇలా విడుదలకు ముందు విపరీతమైన నెగెటివిటీతో దెబ్బ తిన్న సినిమా ‘లాల్ సింగ్ చడ్డా’. ఆమిర్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘పీకే’లో ఒక సీన్లో హిందూ దేవుడిని అవమానించారని.. ఒక ఇంటర్వ్యూలో దేశంలో అసహనం పెరిగిపోతోందని వ్యాఖ్యానించాడని.. ఇలాంటి కారణాలేవో చూపించి ఇప్పుడు ఈ చిత్రాన్ని టార్గెట్ చేశారు. కొన్ని రోజుల నుంచి అదే పనిగా ‘బాయ్‌కాట్ లాల్ సింగ్ చడ్డా’ అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి దీని గురించి నెగెటివిటీని స్ప్రెడ్ చేశారు.
సోషల్ మీడియా ఎఫెక్ట్ బయట జనాల మీద ఎంత ఉంటుందిలే అని తేలిగ్గా తీసిపారేయడానికి వీల్లేదు. ఆ ప్రభావం అడ్వాన్స్ బుకింగ్స్ మీద పడింది. ఆమిర్ ఏ సినిమాకు లేనంత దారుణంగా బుకింగ్స్ జరిగాయి. ట్రైలర్ ఆసక్తికరంగా లేకపోవడం, కొవిడ్ అనంతర పరిస్థితులు కూడా ఇందుకు కారణమే అయినప్పటికీ.. సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం కూడా చేటు చేసిందన్నది వాస్తవం. ఇక సినిమాకు బ్యాడ్ టాక్ వచ్చేసరికి ఈ బ్యాచ్ మరింత రెచ్చిపోయింది. సినిమాను ఇంకా దెబ్బ తీస్తోంది.
కట్ చేస్తే శుక్రవారం నితిన్ సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’ థియేటర్లలోకి దిగుతోంది. ఈ సినిమాను కూడా బ్యాన్ చేయాలని, బాయ్‌కా్ చేయాలని కొన్ని రోజుల కిందట సోషల్ మీడియాలో గట్టి ప్రచారం జరగడం తెలిసిందే. కొన్ని కులాలను కించపరిచేలా ఈ చిత్ర దర్శకుడు ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి ట్వీట్లు వేశాడంటూ అతడి మీద యుద్ధం ప్రకటించారు. అత్యంత వివాదాస్పదంగా మారిన ట్వీట్ ఫేక్ అని రాజశేఖర్ రెడ్డి వాదించినప్పటికీ.. గతంలో అతను వేసిన అబ్యూజివ్ ట్వీట్లు కొన్ని అతడికి ఇబ్బందిగా మారాయి.
దీంతో నెగెటివ్ ట్రెండ్ చేసిన వాళ్లు తగ్గలేదు. మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకుని రిలీజ్ ముంగిట మళ్లీ సినిమాను టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాపై ఈ ప్రభావం ఎంత మేర పడుతుందో అన్న ఆందోళన చిత్ర బృందంలో నెలకొంది. రిలీజ్ రోజు అదే పనిగా ఈ బ్యాచ్ నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తుందా.. ఒకవేళ టాక్ అటు ఇటుగా ఉంటే సినిమాను కిల్ చేసేస్తుందా అన్న భయాలు టీంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాళ్లకు అవకాశం ఇవ్వకుండా సినిమా మంచి టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర జెండా ఎగరేస్తుందేమో చూడాలి.
This post was last modified on August 12, 2022 11:53 am
కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్కసారిగా పడిపోయింది. వాస్తవానికి గత ఏడాదే ఆయన ప్రజాదరణ తగ్గుముఖం…
టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…
సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…
ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…