ఫిలిం ఇండస్ట్రీలో లింగ వివక్ష, అమ్మాయిలపై లైంగిక వేధింపులు, పారితోషకాల్లో తేడా గురించి హీరోయిన్లు ఎవరిని అడిగినా స్టాండర్డ్ ఆన్సర్స్ ఇస్తుంటారు. తమకూ ఈ విషయాల్లో చేదు అనుభవాలున్నాయని చెబుతారు. ముఖ్యంగా పారితోషకాల్లో తేడా గురించి అడిగితే.. ఏమిటీ వివక్ష అని మాట్లాడతారు. ఫిలిం ఇండస్ట్రీలో ఈ అన్యాయం గురించి విమర్శలు గుప్పిస్తారు. కానీ శ్రుతి హాసన్ మాత్రం ఇందుకు భిన్నంగా మాట్లాడింది.
ఇండస్ట్రీలో లింగ వివక్ష లేదని అనలేదు కానీ.. ఈ విషయంలో సినీ పరిశ్రమను తప్పుబట్టడానికి వీల్లేదని శ్రుతి స్పష్టం చేసింది. సమాజంలో ఎప్పట్నుంచో పురుషాధిక్యత అనేది ఉందని.. అన్ని రంగాల్లోనూ ఇది సహజమే అని, కాబట్టి సినిమా పరిశ్రమలో మాత్రమే పురుషాధిక్యత ఎక్కువ అని, పారితోషకాల విషయంలో పురుషులకు, మహిళలకు తేడా ఉందని అనడంసరికాదని శ్రుతి అభిప్రాయపడింది.
సినిమా అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వాటికి ప్రతిబింబం మాత్రమేనని, అందువలన సినీ పరిశ్రమను మాత్రమే నిందించడంలో అర్థం లేదని ఆమె తేల్చి చెప్పింది. శ్రుతి స్వయంగా దిగ్గజ నటుడైన కమల్ హాసన్ కూతురు. ఆయన అండతోనే ఆమె సినిమాల్లోకి అడుగు పెట్టింది. స్టార్ స్టేటస్ సంపాదించింది. ఇప్పుడొచ్చి పురుషాధిక్యత గురించి, పారితోషకాల్లో తేడా గురించి మాట్లాడితే తండ్రిని కూడా విమర్శించినట్లు అవుతుంది.
అందుకేనేమో చాలామంది హీరోయిన్లలా కాకుండా ప్రాక్టికల్‌గా మాట్లాడే ప్రయత్నం చేసినట్లుంది. ఒక టైంలో మంచి ఊపులో ఉన్న శ్రుతి కెరీర్ మధ్యలో బాగా డల్ అయింది. ఒక దశలో ఆమె కెరీర్ ముగిసిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.. కానీ గత ఏడాది క్రాక్, వకీల్ సాబ్ చిత్రాలతో తన పునరాగమనాన్ని ఘనంగా చాటిందామె. ప్రస్తుతం బాలయ్య, చిరంజీవిల కొత్త సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది కమల్ తనయ.
This post was last modified on August 12, 2022 7:55 am
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్‌కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…