మళ్లీ వార్తల్లోకి వచ్చారు బాలీవుడ్ నటి శిల్పాశెట్టి. ఆ మధ్యన భర్తకు సంబంధించిన ఇష్యూలతో బయటకు రావటానికి.. ముఖం చూపించటానికి కూడా ఇబ్బంది పడిన బ్యూటీ.. కేసుల హ్యాంగోవర్ నుంచి కాస్త బయటపడినట్లుగా చెప్పాలి. ప్రస్తుతం ఆమె ఇండియన్ పోలీస్ ఫోర్స్ అనే వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో సరైన అవకాశాలు రాక ఎదురుచూస్తున్న ఆమెకు.. ఈ వెబ్ సిరీస్ సరైన కమ్ బ్యాక్ గా భావిస్తోంది.
దీంతో తన ఎనర్జీస్ ను మరోసారి చూపించి.. అందరిని ఆకట్టుకోవాలన్న లక్ష్యంతో పని చేస్తున్న ఆమెకు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. షూటింగ్ లో భాగంగా ఆమె ఎడమ కాలికి దెబ్బ తగిలింది. కాస్త పెద్దదే కావటం.. ఆసుపత్రిలో భారీ కట్టు వేసి.. విశ్రాంతి తీసుకోమన్న వేళ.. ఆమె ఆ వివరాలు తెలియజేస్తూ పోస్టు పెట్టారు. డాక్టర్లు రెండు వారాలు విశ్రాంతి తీసుకోమన్నారని.. మళ్లీ మరింత స్ట్రాంగ్ గా తిరిగి వస్తానంటూ నవ్వులు చిందిస్తూ.. వీల్ ఛైర్ మీద నుంచే భారీగా ఫోజులు ఇచ్చేసింది.
అంత పెద్ద కట్టుకొని అంతలా నవ్వుతూ ఫోజులు ఇచ్చిన శిల్పాను చూస్తే.. ఎదురుదెబ్బలు తగిలిన వేళలోనూ హ్యాపీనెస్ ను మిస్ కాకూడదన్న జీవన సత్యాన్ని చెప్పినట్లుగా ఆమె ఫోటోలు ఉన్నాయని చెప్పక తప్పదు. ఈ సందర్భంగా ఆమె ఒక వ్యాఖ్య చేవారు. రోల్.. కెమేరా.. యాక్షన్ .. బ్రేక్ ఏ లెగ్ అని దర్శకుడు క్లాప్ కొట్టిస్తే.. తాను నిజంగానే కాలును బ్రేక్ చేసుకున్న వైనాన్ని సరదాగా చెప్పుకొచ్చారు. బ్రేక్ ఏ లెగ్ అన్నది అద్భుతంగా నటించమని చెబితే తాను కాలు విరగొట్టుకున్నట్లుంగా కాస్తంత కామెడీగా చెప్పిన శిల్ప పోస్టు అందరినీ ఆకర్షిస్తోంది.
This post was last modified on August 11, 2022 10:24 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…