అఖండ ఎఫెక్ట్ – తమన్ హ్యాట్రిక్

బాలయ్యకు నచ్చితే అంతే. పదే పదే అవకాశాలిచ్చేస్తాడు. ఇవాళ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన NBK 108కి సంగీత దర్శకుడిగా తమన్ ని ఫిక్స్ చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పటిదాకా అధికశాతం వర్క్ చేయించుకుంది దేవిశ్రీ ప్రసాద్ తో. మొన్న ఎఫ్3 దాకా ఈ బంధం కంటిన్యూ అయ్యింది. కానీ దానికిచ్చిన మ్యూజిక్ ఆశించిన స్థాయిలో రాలేదన్నది వాస్తవం. అయితే ఇప్పుడు తమన్ ని ఎంచుకోవడం వెనుక అనిల్ ఛాయస్ కన్నా బాలకృష్ణ ఆసక్తే ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే హ్యాట్రిక్ ఛాన్స్ ఇచ్చారని చెప్పొచ్చు.

ఇలాంటి రిపీట్ కాంబోలు ఆసక్తి రేపేలా ఉంటాయి. గతంలో మణిశర్మ, కోటిలు ఇలా బాలయ్య సినిమాలకు నాన్ స్టాప్ గా వర్క్ చేసేవారు. 1996 నుంచి కోటి హవా సాగితే సమరసింహారెడ్డి వచ్చాక మెలోడీ బ్రహ్మ డామినేషన్ మొదలయ్యింది. 2001 నరసింహనాయుడుతో మొదలుపెట్టి లక్ష్మినరసింహ దాకా ఏకధాటిగా ఆరు ఆల్బమ్స్ మణిశర్మవే వచ్చాయి. ఏదైనా బ్రేక్ దొరికిందంటే ఆ స్పేస్ లో కోటి ఛార్జ్ తీసుకునేవారు తప్ప ఇంకొకరికి ఛాన్స్ ఉండేది కాదు. ఇన్నేళ్ల తర్వాత తిరిగి తమన్ అంతటి గుర్తింపు తెచ్చుకోవడం విశేషం.

ఇదంతా అఖండ పుణ్యమే. దానికిచ్చిన పాటల కన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆ మూవీ సక్సెస్ లో సింహభాగం తీసుకుంది. థియేటర్లు దద్దరిల్లిపోయేలా ఇచ్చిన బీజిఎంని తలుచుకుంటే ఇప్పటికీ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ వస్తాయి. అందుకే గోపిచంద్ మలినేని వేరే ఆలోచన చేయకుండా తమన్ నే లాక్ చేసుకున్నాడు. ఇప్పుడు అనిల్ రావిపూడి వంతు వచ్చింది. డెబ్యూ మూవీ పటాస్ తో మొదలుపెట్టి ఇప్పటిదాకా ఎంటర్ టైన్మెంట్ మీద సూపర్ హిట్లు కొట్టిన ఈ మాడరన్ ఈవివి బాలయ్యని నెవర్ బిఫోర్ క్యారెక్టర్ లో చూపిస్తాడట