సూపర్ స్టార్ మహేష్ అభిమానుల మేనియా మామూలుగా లేదు కొన్ని రోజుల నుంచి. తెలుగు రాష్ట్రాల్లోనే కాక అమెరికాలో వాళ్లు చేసిన సందడి అంతా ఇంతా కాదు. స్టార్ హీరోల పుట్టిన రోజులు వచ్చినపుడు స్పెషల్ షోలు వేయడం మామూలే కానీ.. అవి పెద్ద సిటీల్లో ఒకటో రెండో ఉంటాయంతే. కానీ ఈసారి మహేష్ పుట్టిన రోజును పురస్కరించుకుని ముందు పదుల సంఖ్యలో పోకిరి సినిమా స్పెషల్ షోలు ప్లాన్ చేస్తే అవి కాస్తా వందల్లోకి వెళ్లిపోయాయి.
ఏదో కొత్త సినిమా కోసం ఎగబడ్డ తరహాలో ఈ సినిమా కోసం అభిమానులు వెర్రెత్తిపోయారు. వాళ్ల ఉత్సాహం, డిమాండ్ చూసి తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి పేరున్న సిటీ, టౌన్లో పోకిరి షోలు వేశారు. అమెరికాలో సైతం చెప్పుకోదగ్గ సంఖ్యలు షోలు పడ్డాయి. చెన్నై, బెంగళూరు లాంటి సిటీలకు కూడా ఈ ఫీవర్ పాకిపోయి అక్కడా స్పెషల్ షోలు వేశారు. అన్ని షోలకూ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. ఈ షోల గ్రాస్ కోటి రూపాయలు దాటిపోవడం విశేషం.
ఎప్పుడో 16 ఏళ్ల కిందట విడుదలైన సినిమా ఇప్పుడు ఇలా రీ రిలీజ్ అయి.. ఇంత డిమాండ్ తెచ్చుకోవడం, ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం అనూహ్యమైన విషయం. ఈ తరహా రేంజ్ మహేష్ అభిమానులు కూడా ఊహించనిది. ఇక సినిమా ప్రదర్శన సందర్భంగా థియేటర్ల ముందు, లోపల జరిగిన హంగామా గురించి ఎంత చెప్పినా తక్కువే. కొత్త సినిమా రిలీజ్ స్థాయిలో అభిమానులు సంబరాలు చేశారు. కటౌట్లు పెట్టి, డీజేలు పెట్టి డ్యాన్సులేశారు. బాణసంచాలు కాల్చారు. థియేటర్లలో అయితే ఎవ్వరూ కుదురుగా కూర్చున్నది లేదు.
ఇంట్రో సీన్లకు, ఎలివేషన్ సీన్లకు, యాక్షన్ ఘట్టాలకు, పంచ్ డైలాగులకు, పాటలకు.. ఇలా ఫ్యాన్స్‌కు హై ఇచ్చే ప్రతి మూమెంట్లోనూ థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ప్రతి థియేటర్‌లోనూ పండుగ వాతావరణం నెలకొంది. ఆ సంబరాల తాలూకు వీడియోలు అభిమానులకు మామూలు కిక్ ఇవ్వట్లేదు సోషల్ మీడియాలో. ఈ సందడి చూశాక మిగతా స్టార్ హీరోల అభిమానులకూ ఇలాగే తమ హీరో పుట్టిన రోజుకు స్పెషల్ షోలతో సంబరాలు చేసుకోవాలని.. దీన్ని బీట్ చేసేలా హంగామా ఉండాలని కోరిక పుడుతోంది. కానీ ఈ యుఫోరియాను మ్యాచ్ చేయడం మాత్రం అంత తేలిక కాదు. ముందుగా సెప్టెంబరు 2న పవర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా జల్సా స్పెషల్ షోలతో పవన్ ఫ్యాన్స్ రంగంలోకి దిగుతున్నారు. వాళ్ల హంగామా ఎలా ఉంటుందో చూడాలి మరి.
This post was last modified on August 11, 2022 3:07 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…