తెలుగులో తమిళ హీరోలు ఫాలోయింగ్ సంపాదించుకోవడం, వాళ్ల సినిమాలు మంచి క్రేజ్ మధ్య రిలీజ్ కావడం మామూలే. రజినీకాంత్, కమల్ హాసన్‌ల దగ్గర్నుంచి కార్తి వరకు చాలామంది తమిళ స్టార్లు ఇక్కడ మార్కెట్ సంపాదించుకున్నవారే. ఐతే మిగతా ఏ భాషలకు చెందిన హీరోలకూ తెలుగులో పెద్దగా మార్కెట్ లేదు. గతంలో హిందీ స్టార్ల సినిమాలు కొన్ని ఇక్కడ బాగా ఆడాయి. మలయాళ, కన్నడ స్టార్లు కూడా తెలుగులో నటించారు. కానీ ఎవరూ కూడా ప్రత్యేకంగా మార్కెట్ సంపాదించుకున్న వారు కాదు. ఐతే ఇప్పుడు ఒక మలయాళ హీరో తెలుగులో చాప కింద నీరులా తన పాలోయింగ్‌ను విస్తరిస్తున్నాడు.
యూత్‌కు బాగా చేరువ అవుతున్నాడు. అమ్మాయిలకు అయితే అతను హార్ట్ త్రోబ్ అనే చెప్పాలి. ఈ ఉపోద్ఘాతం అంతా దుల్కర్ సల్మాన్ గురించే. దుల్కర్ తండ్రి తెలుగులో స్వాతి కిరణం, యాత్ర లాంటి మంచి సినిమాల్లో నటించారు. త్వరలోనే ఏజెంట్ మూవీలోనూ ఆయన కనిపించబోతున్నారు. ఐతే ఆయనకంటూ ఇక్కడ మార్కెట్ అయితే క్రియేటివ్వలేదు. కానీ తెలుగు వరకు దుల్కర్.. తండ్రిని మించిన తనయుడు అనిపించుకుంటున్నాడు.
ఐతే అతను తండ్రి పేరు చెప్పుకునేమీ ఇక్కడ అడుగు పెట్టలేదు. తమిళ చిత్రం ఓకే కణ్మణి డబ్బింగ్ వెర్షన్‌తో అతను తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. అది అతడికి మంచి గుర్తింపునిచ్చింది. తర్వాత మహానటిలో జెమిని గణేషన్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు. దీంతో అతడికి ఇక్కడ ఫాలోయింగ్ పెరిగింది.
ఆ తర్వాత తమిళ అనువాద చిత్రం కనులు కనులను దోచాయంటే మూవీ సర్ప్రైజ్ హిట్టయి దుల్కర్‌కు ఇంకా మంచి పేరు తెచ్చింది. ఇప్పుడిక సీతారామంతో అతను తెలుగులో విశేషమైన పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నాడు. ఈ దెబ్బతో అతడికి తెలుగులో స్టార్ ఇమేజ్ వచ్చేసిందంటే అతిశయోక్తి కాదు. యూత్‌కు అతను విపరీతంగా నచ్చేస్తున్నాడు. అమ్మాయిలు తన కోసం పడి చచ్చిపోతున్నారు. అతను తెలుగులో చేసే తర్వాతి సినిమాకు బంపర్ క్రేజ్ వస్తుందనడంలో సందేహం లేదు.
This post was last modified on August 11, 2022 10:21 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…