టాలీవుడ్ లో జెట్ స్పీడులో బిజీ అయిన కుర్ర దర్శకుల్లో ప్రశాంత్ వర్మ ఒకడు. నాని నిర్మాణంలో ‘అ!’ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమై తక్కువ టైంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. తర్వాత ‘కల్కి’ అంత ఆడకపోయినా ‘జంబీ రెడ్డి’ తో మోస్తరు కలెక్షన్స్ అందుకొని సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం అదే హీరోతో ‘హనుమాన్’ అనే సినిమా చేస్తున్న ప్రశాంత్ వర్మ ఇప్పుడు టివీ , ఓటీటీ షోస్ ప్రోమో స్పెషలిస్ట్ అయిపోయాడు.
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన ‘అన్ స్టాపబుల్’ షో కి ముందు రిలీజ్ చేసిన ప్రోమోని డైరెక్ట్ చేసింది ప్రశాంత్ వర్మనే. ఆ ప్రోమో బాగా వైరల్ అయింది. దాంట్లో బాలయ్య స్టైల్ ని అదిరిపోయేలా చూపించి మంచి మార్కులు కొట్టేశాడు ప్రశాంత్ వర్మ. ఆ తర్వాత కూడా కొన్ని ప్రోమోలకు ఇన్పుట్స్ ఇచ్చాడు. ఇప్పుడు తాజాగా రిలీజైన నాగార్జున బిగ్ బాస్ 6 కి సంబంధించి కూడా ప్రశాంత్ వర్మనే డైరెక్ట్ చేశాడు.
ఒకపక్కా సినిమాలు చేస్తూనే మరోవైపు తనకి ఇంట్రెస్టింగ్ అనిపించే షో ప్రోమోస్ కి వర్క్ చేస్తూ కమర్షియల్ గా కూడా వర్కౌట్ చేసుకుంటున్నాడు. మరి ప్రోమోలు అదరగొడుతున్న ప్రశాంత్ వర్మ దర్శకుడిగా మెప్పిస్తాడా ? లేదా కేవలం ప్రోమోలకు స్పెషలిస్ట్ అనిపించుకుంటాడా అనేది హనుమాన్ రిజల్ట్ తో తేలిపోనుంది.
This post was last modified on August 11, 2022 8:40 am
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…