నాగ చైతన్య తో దిల్ రాజు నిర్మించిన ‘థాంక్యూ’ డిజాస్టర్ అనిపించుకున్న సంగతి తెలిసిందే. అసలు ఇంత చిన్న ఐడియాతో అంత పెద్ద సినిమా చేయడమే మేకర్స్ చేసిన పొరపాటు అన్నట్టుగా ఆడియన్స్ కామెంట్స్ చేశారు. దిల్ రాజు కూడా రిజల్ట్ తర్వాత తను చేసిన తప్పు ఏంటో తెలుసుకున్నాడు కానీ అప్పటికే సినిమాకు జరగాల్సిన డ్యామేజ్ అయిపోయింది. ముందే ఓటీటీ డీల్ సెట్ చేసుకోవడం కొంతలో కొంత దిల్ రాజుకి ఉపసమనం ఇచ్చింది.
అయితే ఆ సినిమా రిజల్ట్ చైతూ కెరీర్ పై గట్టిగా పడింది. ఇప్పుడిప్పుడే సక్సెస్ ఫుల్ కెరీర్ చూస్తున్న చైతూకి థాంక్యూ రిజల్ట్ పెద్ద ఎఫెక్టే. ఈ సినిమా రిలీజ్ తర్వాత చైతూ ఎక్కడా నోరు మెదపలేదు. తాజాగా లాల్ సింగ్ చడ్డా ప్రమోషన్స్ లో థాంక్యూ రిజల్ట్ గురించి మాట్లాడాడు. థాంక్యూ తనని డిస్సప్పాయింట్ చేసిందని అన్నాడు.
కానీ యాక్టర్ లైఫ్ లో ఇవన్నీ సహజమేనని ఫెయిల్యూర్స్ వచ్చినా ఆగకుండా సినిమాలు చేస్తూ ముందుకు సాగడమే, ప్రతీది నేర్చుకుంటూ తెలుసుకుంటూ వెళ్ళడమే అంటూ చెప్పుకున్నాడు. అంతే కాదు సినిమాలో తప్పులున్నాయి అంటూ చైతూ ఓ కామెంట్ పాస్ చేశాడు. చివర్లో నెక్స్ట్ సినిమాతో స్ట్రాంగ్ గా వస్తానని కాస్త కాన్ఫిడెంట్ గా చెప్పాడు.
‘లాల్ సింగ్ చడ్డా’లో ఆమీర్ ఖాన్ తో కలిసి ఓ స్పెషల్ రోల్ చేశాడు చైతూ. ఈ సినిమా తనని నటుడిగా మరో మెట్టు ఎక్కిస్తుందని భావిస్తున్నాడు. అలాగే హీరోగా వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెలుగు , తమిళ్ బైలింగ్వెల్ సినిమా చేస్తున్నాడు. అందులో పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు చైతూ. ఆ ప్రాజెక్ట్ తో మళ్ళీ హీరోగా హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.
This post was last modified on August 11, 2022 1:08 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…