నిన్న మహేష్ బాబు బర్త్ డే ని పురస్కరించుకొని సూపర్ స్టార్ ఫ్యాన్స్ పోకిరి , ఒక్కడు షోలను ప్లాన్ చేసుకున్నారు. నెల ముందే పండుగాడు మళ్ళీ వస్తున్నాడు అంటూ పోకిరి స్పెషల్ స్క్రీనింగ్ ని ప్రమోట్ చేసుకున్నారు. దీంతో నిన్న పోకిరి షోలు అభిమానులతో కిక్కిరిసిపోయాయి. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ షోలకు బాగానే వచ్చారు. పుట్టిన రోజు ముందు రోజు అంటే ఆగస్ట్ 8న ‘ఒక్కడు’ షో వేశారు ఫ్యాన్స్.
ఐమ్యక్స్ లో ఆరోజంతా షోస్ పడ్డాయి. ఉదయం నుండి అర్థరాత్రి వరకూ ప్రసాద్స్ లో షోలు వేశారు. అంతే కాదు దర్శకుడు గుణశేఖర్ , హీరోయిన్ భూమిక ని కూడా ఇన్వైట్ చేశారు. ఇక పోకిరి గురించైతే చెప్పనక్కర్లేదు. నిన్న మహేష్ కొత్త సినిమా కంటే ఎక్కువ సందడే థియేటర్స్ దగ్గర కనిపించింది.
ఆంద్రప్రదేశ్ , తెలంగాణా మొత్తంగా దాదాపు 200లకు పైగా షోస్ పడ్డాయి. ఓవర్ సీస్ లో కూడా బాగానే షోలు పడ్డాయి. అన్ని చోట్లా హౌజ్ ఫుల్స్ అయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో పోకిరి తీవ్రత ఎక్కువ కనిపించింది. దీంతో ఈ వారం రిలీజై హిట్ టాక్ అందుకున్న ‘బింబిసార’, ‘సీతారామం’ ల కలెక్షన్స్ పై మహేష్ సినిమాల ఎఫెక్ట్ గట్టిగా పడింది.
పోకిరి ఎఫెక్ట్ తో నిన్న చాలా చోట్ల బింబిసార , సీతారామం కలెక్షన్స్ తక్కువ వచ్చాయి. ఏదేమైనా మహేష్ ఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా మళ్ళీ థియేటర్స్ కి రప్పించి ఓ రేంజ్ లో హంగామా చేశాడు పండుగాడు. మహేష్ ఇకపై సందేశాత్మక సినిమాలకంటే ఇలాంటి మాస్ సినిమాలే చేయాలని ‘ఒక్కడు’, ‘పోకిరి’ స్పెషల్ షోల రెస్పాన్స్ ద్వారా ఫ్యాన్స్ చెప్పకనే చెప్పారు. ఏదేమైనా నిన్న హిట్ సినిమాలపై మాత్రం మహేష్ సినిమా దెబ్బ గట్టిగానే పడింది.
This post was last modified on August 10, 2022 6:54 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…