‘ఎఫ్-3’ తర్వాత విక్టరీ వెంకటేష్ నటించే కొత్త సినిమా ఏదీ ఖరారవ్వలేదు. ఈలోపు ఆయన చేయబోయే అతిథి పాత్ర గురించి సమాచారం బయటికి వచ్చింది. విశ్వక్సేక్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘ఓరి దేవుడా’ సినిమాలో వెంకీ దేవుడి పాత్ర చేయబోతున్నట్లు వెల్లడైంది. తమిళంలో విజయ్ సేతుపతి ఈ పాత్రలో మెరిశాడు. కనిపించేది చాలా తక్కువ సన్నివేశాల్లోనే అయినా.. ఆ పాత్ర అక్కడ మంచి ఇంపాక్ట్ వేసింది. సినిమాకు ఆకర్షణగా మారింది.
కన్నడలో ఇదే పాత్రను దివంగత పునీత్ రాజ్ కుమార్ చేయడం విశేషం. ఇంకా ఆ చిత్రం విడుదల కాలేదు. ఐతే ‘ఓరి దేవుడా’ సినిమా మొదలై దాదాపు రెండేళ్లు కావస్తోంది. కొవిడ్ టైంలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయినట్లు, విడుదలకు సిద్ధమవుతున్నట్లు వార్తలొచ్చాయి. గత ఏడాదే కమింగ్ సూన్ అంటూ ప్రోమోలు రిలీజ్ చేశారు. విశ్వక్సేన్ మరో చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ కంటే ముందు ఇది విడుదల కావాల్సింది. కానీ ఏం జరిగిందో ఏమో.. ఈ సినిమా ఉన్నట్లుండి వార్తల్లో లేకుండా పోయింది.
ముందు ఇందులోని దేవుడి పాత్రకు వేరే నటుడిని అనుకోగా.. షూటింగ్ మొదలు కావాల్సిన సమయంలో ఇంకాస్త పెద్ద హీరో చేస్తే సినిమాకు ప్లస్ అవుతుందని భావించి నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఈ పాత్రను ఎవరితో చేయిద్దామా అని చూసి చూసి.. చివరికి వెంకీతో ఓకే చేయించుకున్నారు. ఆయన ఎట్టకేలకు ఖాళీ అయి ఈ సినిమాకు డేట్లు కేటాయించారు. కేవలం మూడే మూడు రోజుల కాల్ షీట్లు ఇచ్చారట వెంకీ. సినిమా మొత్తంలో ఆయన పాత్ర కనిపించేది పది నిమిషాలే. వెంకీ కాంబినేషన్ సీన్లు మినహా చిత్రీకరణ మొత్తం ఎప్పుడో పూర్తయింది.
విశ్వక్సేన్ మళ్లీ ‘ఓరి దేవుడా’ లుక్‌లోకి మారి వెంకీతో కలిసి సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొనబోతున్నాడు. వెంకీ రావడంతో సినిమాకు ప్రమోషన్ల పరంగా మంచి బజ్ క్రియేట్ అవుతుందనడంలో సందేహం లేదు. ఇక విశ్వక్ ఎలాగూ అగ్రెసివ్ ప్రమోషన్లకు ఎప్పుడూ రెడీగానే ఉంటాడు. అందులోనూ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ కూడా మంచి స్పందన తెచ్చుకుంది కాబట్టి ఈ చిత్రానికి మంచి హైప్ రావడం గ్యారెంటీ. తమిళంలో ‘ఓ మై కడవులే’ పేరుతో దీని ఒరిజినల్‌ను రూపొందించిన అశ్వత్ మారిముత్తునే తెలుగులోనూ డైరెక్ట్ చేస్తున్నాడు. విశ్వక్ సరసన బాలీవుడ్ భామ మిథిల పాల్కర్ నటించిన ఈ చిత్రాన్ని పీవీపీ సినిమాస్ నిర్మించింది.
This post was last modified on August 10, 2022 12:32 pm
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…