మొన్నటిదాకా సరైన సినిమాలు లేక థియేటర్లు వెలవెలబోయాయి. అందుబాటులో బోలెడన్ని థియేటర్లు ఉన్నా ఉపయోగించుకునే సినిమాలు కరవయ్యాయి. జనాలు లేక షోలు క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితులు కూడా చాలా సినిమాలకు తలెత్తాయి. అప్పుడు థియేటర్లను సరిగ్గా ఉపయోగించుకునే సినిమాల కోసం అందరూ ఎదురు చూశారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోతోంది. మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. వాటి పట్ల ప్రేక్షకుల్లోనూ మంచి ఆసక్తి కనిపిస్తోంది. కానీ ఆ సినిమాలకు చాలినన్ని థియేటర్లు కేటాయించే పరిస్థితి కనిపించడం లేదు.
చాన్నాళ్ల తర్వాత గత వారాంతంలో విడుదలైన సీతారామం, బింబిసార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వస్తోంది. వీకెండ్లోనే కాక.. ఆ తర్వాత కూడా ఈ రెండు చిత్రాలూ మంచి వసూళ్లు రాబడుతున్నాయి. ఐతే ఈ బుధవారం వరకు ఈ చిత్రాలకు ఢోకా ఏమీ లేదు కానీ.. తర్వాత మాత్రం కష్టంగానే ఉంది. రాబోయే వారాంతంలో మాచర్ల నియోజకవర్గం లాంటి మాస్ సినిమా, కార్తికేయ-2 లాంటి అడ్వెంచరస్ థ్రిలర్ రిలీజవుతున్నాయి. వీటికి తోడు బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో, అక్కినేని నాగచైతన్య ప్రత్యేక పాత్రలో నటించిన లాల్ సింగ్ చడ్డా కూడా విడుదలవుతోంది.
లాల్ సింగ్ చడ్డా తెలుగు రాష్ట్రాల్లో హిందీ, తెలుగు వెర్షన్లలో రిలీజ్ కానుంది. ఇప్పుడు ఆడుతున్న రెండు సినిమాలకూ మంచి స్పందన వస్తుండటంతో వాటికి థియేటర్లు తగ్గించడం కష్టం. అలా అని కొత్త సినిమాలకు ప్రాధాన్యం తగ్గించలేరు. మొత్తంగా ఈ వీకెండ్లో అయిదు సినిమాలకు థియేటర్లు సర్దుబాటు చేయడం చాలా కష్టమయ్యేలా కనిపిస్తోంది. ముందు వారం వచ్చిన సినిమాలు ఫ్లాప్ అయితే సమస్య అయ్యేది కాదు కానీ.. అవి రెండూ బాగా ఆడుతూ, కొత్తగా మూడు పేరున్న సినిమాలు రావడంతో అన్నింటికీ థియేటర్ల సర్దుబాటు అంటే కష్టమే.
ఈ విషయంలో గొడవలు తప్పేలా లేవు. నితిన్ సినిమాకు ముందే థియేటర్లు చాలా వరకు బుక్ అయ్యాయి. అతడి తండ్రి సుధాకర్ రెడ్డికి మంచి పలుకుబడి కూడా ఉంది. దానికి మరీ సమస్య కాకపోవచ్చు. కానీ లేటుగా రేసులోకి వచ్చి, మిగతా రెండు చిత్రాల కంటే ఆలస్యంగా రిలీజ్ కానున్న కార్తికేయ-2కే దెబ్బ పడేలా ఉంది. ఇప్పటికే ఈ సినిమా పలుమార్లు వాయిదా పడింది. థియేటర్ల విషయంలోనూ ఇబ్బందులు తలెత్తాయి. దీనిపై హీరో నిఖిల్ ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేశాడు. మరి అతడి సినిమాకు ఎంత వరకు న్యాయం జరుగుతుందో చూడాలి.
This post was last modified on August 10, 2022 1:45 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…