ప్యాన్ ఇండియా సినిమాను ప్రమోట్ చేసుకోవడం ఎలాగో ఆర్ఆర్ఆర్ తో రాజమౌళి ఒక మోడల్ ని ఆవిష్కరించాక అందరూ దాన్నే ఫాలో కాక తప్పని పరిస్థితి తలెత్తింది. మాతృబాష రాష్ట్రం కన్నా ఎక్కువగా ఇతర స్టేట్స్ కు వెళ్లి మరీ పబ్లిసిటీ చేస్తే తప్ప జనం చూడరనే అభిప్రాయం ఇండస్ట్రీ జనాల్లో బలంగా నాటుకుపోయింది. అందుకే స్పెషల్ ఫ్లైట్స్ వేసుకుని మరీ నగరాలూ పట్టణాలు రౌండ్ వేయాల్సి వస్తోంది. కాదేది ప్రచారానికి అనర్హం సామెతను పాటిస్తూ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ టీమ్ మొత్తం వాలిపోతోంది.
ఇప్పుడు లైగర్, లాల్ సింగ్ చడ్డా బృందాలు అదే పనిలో ఉన్నాయి. విజయ్ దేవరకొండ గత పది రోజులకు పైగా నార్త్ టూర్ లోనే బిజీగా ఉన్నాడు. షాపింగ్ మాల్స్, కాలేజీలు, మెట్రో రైళ్లు, ప్రైవేట్ ఈవెంట్లు, హోటళ్లు, న్యూస్ ఛానల్స్ ఓటిటిలకు ఇంటర్వ్యూలు ఒకటేమిటి అన్నిరకాలుగా తనను తాను మార్కెట్ చేసుకోవడానికి బాగా కష్టపడుతున్నాడు. ముంబైలో అయితే ఏకంగా ఫ్యాన్స్ రద్దీని తట్టుకోలేక సగంలోనే మీటింగ్ ఆపేసి వెనుదిరగాల్సి రావడం అక్కడి మీడియాలో చాలా హై లైట్ అయ్యింది. ఇదంతా లైగర్ కథ.
మనోడు అక్కడ తిరుగుతుంటే అమీర్ ఖాన్ మాత్రం పదే పదే హైదరాబాద్ వస్తూ లాల్ సింగ్ మీద హైప్ పెంచే ప్రయత్నం జోరుగా చేస్తున్నాడు. చిరంజీవి నామమాత్రపు సమర్పకుడిగా వ్యవహరించకుండా ప్రత్యేకంగా దీని కోసం ప్రోగ్రాంలు కూడా చేస్తున్నారు. ఏఎంబిలో వేసిన ప్రీమియర్ లో మూవీని రెండోసారి చూశారు. హిందీకన్నా ఎక్కువ అమీర్ ఫోకస్ ఇక్కడే ఉండటం విశేషం. అవతల రౌడీ హీరో ఉత్తరాదిలో, ఇవతల వర్సటైల్ స్టార్ దక్షిణాదిలో ఏదో ఎక్స్ చేంజ్ చేసుకున్నట్టు తెగ తిరిగేస్తున్నారు. చూడాలి మరి ఎలాంటి ఫలితాలు వస్తాయో
This post was last modified on August 9, 2022 5:22 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…