ఉప్పెన రూపంలో డెబ్యూతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ తో ఓ ప్యాన్ ఇండియా మూవీ ఉంటుందన్నారు. పెద్ది అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఆర్ఆర్ఆర్ విడుదలకు ముందు లెక్కలు మారిపోయాయి. ఎందుకనో బయటికి చెప్పలేదు కానీ మొత్తానికి దాన్ని పెండింగ్ లో పెట్టేశారు.
అదేమీ క్యాన్సిల్ కాలేదని కొరటాల శివ స్క్రిప్ట్ ఒక కొలిక్కి వచ్చి షూటింగ్ స్టార్ట్ చేశాక అప్పుడు పెద్ది గురించిన డిస్కషన్ వస్తుందని ఇన్ సైడ్ టాక్. ఇదంతా ఒక ఎత్తయితే ఇటీవలే బుచ్చిబాబు రామ్ చరణ్ కో లైన్ వినిపించాడని, అది నచ్చి ఫుల్ వెర్షన్ డెవలప్ చేశాక కలవమని చెప్పినట్టుగా కొత్త పుకారు స్టార్ట్ అయ్యింది. నిజానికి చరణ్ ఫుల్ టైట్ షెడ్యూల్ లో ఉన్నాడు.
శంకర్ ది పూర్తయ్యేలోగా వచ్చే ఏడాది మార్చో ఏప్రిలో అవుతుంది. అది కాగానే గౌతమ్ తిన్ననూరి రెడీగా ఉంటాడు. నెక్స్ట్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. మెగా పవర్ స్టార్ డైరీ ఈ స్థాయిలో ప్యాకప్ అయితే అసలు బుచ్చిబాబుతో మూవీ గురించి వార్తలు చక్కర్లు కొట్టడం ఊహించని ట్విస్టు.
మరోవైపు తన గురువు సుకుమార్ తో ఇటీవలే జరిపిన కథా చర్చలు దేని గురించో అర్థం కాక అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అది పెద్ది కోసమా లేక వైష్ణవ్ తేజ్ కోసం రాసుకున్న మరోదానికా లేక చరణ్ నిజంగానే ఏమైనా మాట ఇచ్చాడా అనే అయోమయం కలుగుతోంది. సుక్కుకు సైతం రంగస్థలం ఇండస్ట్రీ హిట్ సాధించాక ఇదే పరిస్థితి ఎదురై రెండేళ్లు ఖర్చు పెట్టేసి మధ్యలో మహేష్ బాబుతో ఓ సినిమా డ్రాప్ అయ్యాక అప్పుడు అల్లు అర్జున్ తో పుష్ప ఓకే అయ్యింది. తర్వాత జరిగింది తెలిసిందే. మరి శిష్యుడు కూడా అదే దారి పట్టి రెండో విఘ్నం దాటుతాడా.
This post was last modified on August 9, 2022 2:09 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…