ఏడాది వెనక్కి వెళ్తే నందమూరి అభిమానులు చాలా నిరాశలో ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజై అప్పటికి మూడేళ్లు అయింది. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ ఎప్పుడో ఏంటో అప్పటికి క్లారిటీ లేదు. అది వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. నందమూరి బాలకృష్ణ అప్పటికి వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నాడు. ఆయన చివరి సినిమా ‘రూలర్’ పెద్ద డిజాస్టర్ అయింది. ఇక కళ్యాణ్ రామ్ సంగతి సరే సరి. ‘ఎంత మంచివాడవురా’తో అతను చేదు అనుభవం ఎదుర్కొన్నాడు.
కానీ ఏడాది తిరిగేసరికి ఇప్పుడు మొత్తం కథ మారిపోయింది. ముగ్గురు నందమూరి హీరోలూ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లతో అభిమానులను ఆనందంలో ముంచెత్తుతున్నారు. గత ఏడాది చివర్లో బాలయ్య సినిమా ‘అఖండ’ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. డివైడ్ టాక్‌ను తట్టుకుని ఆ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. మూణ్నాలుగు వారాల తర్వాత కూడా ఆ చిత్రం హౌస్‌ఫుల్స్‌తో రన్ అయింది.
కొన్ని నెలల తర్వాత ‘ఆర్ఆర్ఆర్’తో జూనియర్ ఎన్టీఆర్ సత్తా చాటాడు. అందులో అతడి నట ప్రతిభకు వివిధ భాషల ప్రేక్షకులు జేజేలు పలికారు. సినిమా కూడా భారీ విజయం సాధించి తారక్ మార్కెట్‌ను పెంచింది. ఇప్పుడు ఎన్టీఆర్ తర్వాతి సినిమా కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కొన్ని నెలల తర్వాత ఇప్పుడు కళ్యాణ్ రామ్ సైతం బాక్సాఫీస్ దగ్గర తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు. చివరగా అంత పెద్ద డిజాస్టర్ ఇచ్చినప్పటికీ.. ‘బింబిసార’కు మంచి హైప్ వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరిగాయి. ఇక సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు అంచనాలను మించిపోతున్నాయి.
తొలి రోజు సాయంత్రం నుంచి ఈ సినిమాకు థియేటర్లు, షోలు పెంచాల్సిన పరిస్థితి తలెత్తింది. బయ్యర్ల పెట్టుబడిలో సగం తొలి రోజే వచ్చేసిందంటే ఈ సినిమా ఎంత బాగా ఆడుతోందో అర్థం చేసుకోవచ్చు. వరల్డ్ వైడ్ బయ్యర్లందరూ వీకెండ్లోనే లాభాల బాట పట్టబోతున్నారు. సినిమా పెద్ద రేంజికి వెళ్లబోతోందన్నది స్పష్టం. ఇలా 9 నెలల వ్యవధిలో ముగ్గురు నందమూరి హీరోలు భారీ విజయాలతో అదరగొట్టడం అభిమానులను సంతోషంలో ముంచెత్తుతోంది.
This post was last modified on August 7, 2022 12:00 am
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…