నిఖిల్ టీమ్ కనక రాజీ వద్దనుకుని ఉంటే నిన్న బింబిసార, సీతారామంలతో పాటు కార్తికేయ 2 కూడా విడుదలయ్యేది. కానీ ఒత్తిళ్లో లేక క్లాష్ పెట్టుకుని ఓపెనింగ్స్ తగ్గించుకోవడం ఎందుకనే భావనో మొత్తానికి ముందు ఆగస్ట్ 12 అని చెప్పి ఫైనల్ గా 13కి లాక్ చేశారు. జరిగేది అంతా మంచికే అనే పెద్దల మాట ఇప్పుడీ సినిమా విషయంలో అక్షరాలా నిజమయ్యింది.
ఎందుకంటే బింబిసారకు పాజిటివ్ టాక్ తో పాటు మాస్ నుంచి బలమైన సపోర్ట్ దక్కింది. ముఖ్యంగా బిసి సెంటర్ల వసూళ్లు దానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. మరోవైపు సీతారామం దానికి ధీటుగా తన జానర్ కు సాధారణంగా వచ్చే స్లో రెస్పాన్స్ కి భిన్నంగా రెండో రోజు నుంచే స్పీడ్ పెంచేసింది. నగరాలు పట్టణాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బాగున్నాయి.
మీడియా రివ్యూలు, ఫేస్ బుక్ ఇన్స్ టా ఫీడ్ బ్యాక్స్ అన్నీ పాజిటివ్ గా ఉండటంతో కమర్షియల్ గానూ డీసెంట్ రేంజ్ కి చేరుకునే నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. ఒకవేళ కార్తికేయ 2 కంటెంట్ ఎంత బాగున్నప్పటికీ వీటి మధ్యలో కనక వచ్చి ఉంటే ఆడియన్స్ కి లేనిపోని కన్ఫ్యూజన్ వచ్చి దాని ప్రభావం నేరుగా కలెక్షన్ల మీద పడేది.
ఇదంతా బాగానే ఉంది కానీ కార్తికేయ 2 మీద ఇప్పుడు మరో బరువొచ్చి పడింది. పైన చెప్పిన రెండూ హిట్ కావడంతో రెండో వారంలోనూ స్ట్రాంగ్ రన్ ని కొనసాగిస్తాయి. పైగా లాల్ సింగ్ చడ్డా, మాచర్ల నియోజకవర్గంలతో ఢీ కొంటూ నిఖిల్ యుద్ధం చేయాల్సి ఉంటుంది. నీరసంగా ఉన్న బాక్సాఫీస్ వద్ద కొత్త జోష్ వచ్చిన నేపథ్యంలో దాన్ని గనక కార్తికేయ 2 సరిగా వాడుకుంటే ఇంత గ్యాప్ తీసుకున్న నిఖిల్ కు న్యాయం జరిగినట్టు అవుతుంది. శ్రీకృష్ణుడి బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ ఫాంటసీ డ్రామా మీద అంచనాలు బాగానే ఉన్నాయి.
This post was last modified on August 6, 2022 6:53 pm
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకు చూసింది ఒక లెక్క.. ఇక నుంచి మరో…
ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారిన 'డీజే సౌండ్' వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. తాజాగా అనంతపురంలో నిర్వహించిన వినాయక నిమజ్జన…
ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమా.. ది ప్యారడైజ్. క్వాలిటీ సినిమాలతో పెద్ద స్టార్‌గా…
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడు అనే బ్రాండ్ నుంచి బయట పడి స్వంతంగా ఇమేజ్ సృష్టించుకునేందుకు కష్టపడుతున్న ఆనంద్…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హుడేనంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ విషయాన్ని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్…