కొందరు హీరోలు కొన్ని రకాల సినిమాలకు అసలు సెట్ కారు అనిపిస్తుంది. నందమూరి కళ్యాణ్ రామ్ ప్రేమకథలు, రొమాంటిక్ టచ్ ఉన్న సినిమాలు, ఫ్యామిలీ డ్రామాలు చేసినా అంతే. రఫ్ లుక్‌తో కనిపించే అతను.. కెరీర్ ఆరంభంలో తొలి చూపులోనే, అభిమన్యు లాంటి ప్రేమకథా చిత్రాల్లో నటించాడు. అవి ఏమాత్రం ప్రేక్షకులకు రుచించలేదు. తర్వాత అతను ‘అతనొక్కడే’ లాంటి యాక్షన్ మూవీ చేసి సక్సెస్ అయ్యాడు.
ఆ తర్వాత కెరీర్లో హిట్లు, ఫ్లాపులు ఉన్నాయి కానీ.. ‘నా నువ్వే’ అనే రొమాంటిక్ మూవీ చేస్తే దారుణాతి దారుణమైన ఫలితం ఎదురైంది. ఇక ‘ఎంత మంచివాడవురా’ అనే సాఫ్ట్ ఫ్యామిలీ డ్రామా చేస్తే అది కూడా తీవ్రంగా నిరాశ పరిచింది. ఇప్పుడు ‘బింబిసార’ అనే ఫాంటసీ, హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమా చేస్తే దాని పట్ల ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాను ఎలాంటి సినిమాలు చేయకూడదో కళ్యాణ్ రామ్‌కు ఒక క్లారిటీ వచ్చేసినట్లుంది.
‘బింబిసార’ ప్రి రిలీజ్ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన కళ్యాణ్ రామ్.. తాను ఇకపై రొమాంటిక్ సినిమాల్లో అస్సలు నటించనని తేల్చి చెప్పేశాడు. ‘‘రొమాంటిక్ సినిమాలు నేను చేయను. ఆ విషయాన్ని స్పష్టంగా చెబుతాను. ఆ కథల విషయంలో నాకు చాలా అనుభవాలు ఎదురయ్యాయి. వాటికి నేను సరిపోను. కెరీర్ ఆరంభంలో ప్రేమకథల్లో నటించా. ఆ తర్వాత ‘అతనొక్కడే’తో నా ప్రయాణం కొత్తగా మొదలైంది’’ అని కళ్యాణ్ రామ్ తెలిపాడు.
ఇక తన బేనర్లో ఎన్టీఆర్‌తో చేయాల్సిన సినిమా, అలాగే తన నిర్మాణంలో బాలయ్యతో ఎప్పట్నుంచో అనుకుంటున్న చిత్రం గురించి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ‘‘ఆర్ఆర్ఆర్ విజయం తర్వాత ఎన్టీఆర్ సినిమా అంటే చాలా అంచనాలుంటాయి. అందుకు దీటుగా సినిమా ఉండాలంటే తొందరపడకూడదు. ఈ సినిమా మాకొక పెద్ద నిధి. కానీ ఇలాంటి ప్రాజెక్ట్‌లకు టైం పడుతుంది. బాలయ్య బాబాయికి గతంలో ఒకసారి కథ చెప్పించా. అది నచ్చలేదు. మాకు నచ్చిన కథ బాబాయికి నచ్చాలని లేదు కదా. భవిష్యత్తులో ఏదైనా మంచి కథ నా దగ్గరికి వస్తే బాబాయికి చెప్పి ఒప్పించి ఆ చిత్రాన్ని నేనే నిర్మిస్తా’’ అని చెప్పాడు.
This post was last modified on August 4, 2022 6:53 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…