పాన్ ఇండియా సినిమా అని చిత్ర బృందం చెప్పుకున్నంత మాత్రాన.. పోస్టర్ల మీద వేసుకున్నంత మాత్రాన ఆ సినిమాకు పాన్ ఇండియా రీచ్ వచ్చేయదు. ఇతర భాషల ప్రేక్షకులు ఆ సినిమాను ఓన్ చేసుకునేలా ప్రత్యేకంగా ఏదైనా చేయాలి. ముఖ్యంగా అదొక అనువాద చిత్రం అనే ఫీలింగ్ రానివ్వకుండా పాటలు, డబ్బింగ్, నేటివిటీ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే ఇతర భాషలకు చెందిన ప్రేక్షకులు కూడా అది తమ సినిమా అనుకుంటారు.
బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 లాంటి సినిమాల విషయంలో వాటి మేకర్స్ ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. రాజమౌళి అయితే ఆయా భాషల్లో పేరున్న రచయితలు, లిరిసిస్టులను పెట్టుకుని తన వైపు నుంచి ఒక టీంను ఏర్పాటు చేయించి లిరిక్స్, డైలాగ్స్ విషయంలో జాగ్రత్త వహించడం వల్ల, తాను కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలను అన్ని భాషల వాళ్లూ ఆదరించారు. ‘పుష్ప’ విషయంలో సుకుమార్ పెట్టిన శ్రద్ధ గురించి కూడా అందరికీ తెలిసిందే.
‘కేజీఎఫ్-2’ టీం కూడా ఈ విషయంలో విజయవంతం అయింది. అదొక కన్నడ సినిమా అని తెలుగు, హిందీ, తమిళ భాషల వాళ్లు అస్సలు ఫీల్ కాలేదు. ఐతే ఇలా ఇతర భాషల వాళ్లను మెప్పించడంలో, ఒప్పించడంలో తమిళ ఫిలిం మేకర్స్ విఫలమవుతున్నారు. ఒకప్పుడైతే వాళ్లు ఎంత నేటివిటీ దట్టించినా.. డైలాగ్స్, లిరిక్స్ విషయం ఏమాత్రం శద్ధ పెట్టకపోయినా చెల్లింది కానీ.. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.
తమిళంలో ‘బాహుబలి’ రేంజ్ సినిమాగా ప్రొజెక్ట్ చేస్తున్న ‘పొన్నియన్ సెల్వన్’ విషయానికే వస్తే..ఈ సినిమా టైటిల్ దగ్గర్నుంచి ప్రతి విషయంలోనూ నేటివిటీ గుప్పుమంటోంది. వేరే భాషలకు తగ్గట్లు పేరు మార్చాలని మణిరత్నం అండ్ కోకు అనిపించలేదు. ఇప్పుడు ఈ సినిమా నుంచి ‘పొంగే నది’ అంటూ ఒక పాటను లాంచ్ చేయగా.. అనంత శ్రీరామ్ చక్కటి తెలుగు పదాలతో పాట రాసినా.. రెహమాన్, మరో సింగర్ కలిసి ఆ పదాలను ఖూనీ చేసేశారు.
అసలు వాళ్లేం పాడుతున్నారో అర్థం కాని విధంగా తమిళ వాసన గుప్పుమంటోంది పాటలో. రెహమాన్ తెలుగు పదాలను నోటికొచ్చినట్లు పలకడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా తెలుగు గాయకులతో పాట పాడించాల్సింది లేదా.. తాను శ్రద్ధ పెట్టి తెలుగు ఉచ్ఛారణ సరిగ్గా ఉండేలా చూసుకోవాల్సింది. అలా కాకుండా తెలుగు పదాలను ఖూనీ చేసేయడాన్ని భాషాభిమానులు తప్పుబడుతున్నారు. ఈ మాత్రం శ్రద్ధ పెట్టనపుడు ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎలా ఓన్ చేసుకుంటారు? తమిళులు బాహుబలిని ఆదరించినట్లు మన వాళ్లు దానికి ఎలా పట్టం కడతారు?
This post was last modified on %s = human-readable time difference 6:52 pm
ది హైప్ ఈజ్ రియల్ అనేది సాధారణంగా ఒక పెద్ద సినిమాకున్న అంచనాలను వర్ణించేందుకు అభిమానులు వాడుకునే స్టేట్ మెంట్.…
దేశంలో రిజర్వేషన్ల పరిమితి 50 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. ఏ రిజర్వేషన్ అయినా.. 50 శాతానికి మించి ఇవ్వడానికి…
తండేల్ విడుదల తేదీ ప్రకటన కోసం నిర్వహించిన ప్రెస్ మీట్లో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు టీమ్ పంచుకుంది.…
ఈ దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు పడ్డాయి. వాటికి మంచి వసూళ్లు కూడా వచ్చాయి.…
మరో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి పూర్తిగా బడ్జెట్ సమావేశాలేనని కూటమి సర్కారు చెబుతోంది. వచ్చే మార్చి…
దసరా బ్లాక్ బస్టర్ తో నానికి మొదటి వంద కోట్ల గ్రాసర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రెండోసారి న్యాచురల్…