ఈ నెల 12న రిలీజ్ కాబోతున్న కార్తికేయ 2 కోసం నిఖిల్ ఎంత కష్టపడుతున్నాడో, ప్రమోషన్ల కోసం సోలోగా ఎంతగా తిరుగుతున్నాడో దానికి తగ్గ ఫలితం రావాలని అభిమానులతో పాటు ప్రేక్షకులూ కోరుకుంటున్నారు. అయితే డేట్ విషయంలో తలెత్తిన ఇబ్బందుల కారణంగా మానసిక క్షోభకు గురైన నిఖిల్ కు ఇంకా ఆ చిక్కుముడులు తొలగినట్టు లేదు.
మళ్ళీ మరోసారి వాయిదా తప్పదనే ప్రచారం ఫిలిం నగర్ లో జోరుగా ఉంది. ఒక రోజు ఆలస్యంగా 13న లేదంటే ఇంకో వారం పోస్ట్ పోన్ చేసి 19కి వచ్చేలా యూనిట్ చర్చల్లో ఉన్నట్టు తెలిసింది. ఇంకా అధికారిక ప్రకటనేం రాలేదు కానీ మారడం కన్ఫర్మ్ అని ఇన్ సైడ్ టాక్. లాల్ సింగ్ చడ్డా, మాచర్ల నియోజకవర్గంతో స్క్రీన్లను పంచుకునే విషయంలో కార్తికేయ 2కి ఇంకా సంక్లిష్ఠత తొలగిపోలేదు.
దానికి తోడు వారం ముందు వచ్చే బింబిసార, సీతారామంలు కనీసం రెండు వారాల అగ్రిమెంట్లతో థియేటర్లను లాక్ చేసుకోవడంతో నిఖిల్ సినిమా కౌంట్ విషయంలో రాజీ పడాల్సి ఉంటుంది. ఒకవేళ 13 అయితే ఆలోగా అమీర్ ఖాన్, నితిన్ చిత్రాల టాక్ బయటికి వచ్చేసుంటుంది కాబట్టి శనివారం నిశ్చింతగా బరిలో దిగొచ్చు.
మొత్తానికి మూవీలో ఉన్న సస్పెన్స్ కార్తికేయ 2కి రియల్ లైఫ్ లోనూ తప్పడం లేదు. అసలే అర్జున్ సురవరం తర్వాత గ్యాప్ తీసుకుని చేస్తున్న ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ ఇది. దీని ఫలితం, బిజినెస్ మీద నెక్స్ట్ రాబోయే 18 పేజెస్, స్పై సినిమాల లెక్కలు ఆధారపడి ఉన్నాయి. ఇన్ని ఆశలు పెట్టుకున్న టైంలో ఇలా జరగడం ఆశనిపాతమే. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ ఫాంటసీ డ్రామాకు చందూ మొండేటి దర్శకుడు. శ్రీకృష్ణుడి బ్యాక్ డ్రాప్ లో విజువల్ ఎఫెక్ట్స్ మీద చాలా ఖర్చు పెట్టి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తీశారు.
This post was last modified on August 3, 2022 12:20 pm
ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…