కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ రిలీజ్ రెడీ అయింది. వచ్చే శుక్రవారం థియేటర్స్ లోకి రాబోతుంది. అయితే అధిక బడ్జెట్ తో భారీ స్కేల్ లో తీసిన ఈ సినిమాను కేవలం తెలుగులోనే రిలీజ్ చేయబోతున్నారు. అసలు కంటెంట్ లేని ఏ మాత్రం క్రేజ్ లేని చిన్న చిన్న సినిమాలే హిందీ , తమిళ్ , కన్నడ లో రిలీజ్ చేసుకుంటూ దానికి పాన్ ఇండియా మూవీ అనే పేరు పెట్టేసుకుంటున్న ఈ రోజుల్లో బింబిసార ను కళ్యాణ్ రామ్ ఓన్లీ పాన్ తెలుగు అంటూ రిలీజ్ చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
అసలు కళ్యాణ్ రామ్ కి పాన్ ఇండియా రిలీజ్ ఎందుకు ఇష్టం లేదు? కంటెంట్ మీద నమ్మకం లేకా? ఇమేజ్ లేనందువల్ల భయపడుతున్నారా ? ఇలా అందరిలోనూ చాలా సందేహాలు మొదలయ్యాయి. అయితే ఇటివలే దీని గురించి స్పందించి ఫైనల్ గా క్లారిటీ ఇచ్చేశాడు కళ్యాణ్ రామ్. బింబిసార ను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తే వెంటనే మిగతా భాషల్లో రిలీజ్ ఉంటుందని అన్నారు. ఇక్కడ రిజల్ట్ ని బట్టే అక్కడ రిలీజ్ ఆలోచిస్తానని అన్నాడు.
సినిమా హిట్టయితే రెండు వారాల్లోనే అంటే ఆగస్ట్ 18నే మిగతా భాషల్లో రిలీజ్ ఉండనుందని క్లారిటీ ఇచ్చాడు. అయితే కేవలం రెండు వారాల్లో ఇదంతా సాధ్యమా ? కళ్యాణ్ రామ్ అంతా రెడీ చేసి పెట్టుకున్నాడా ? అనే సందేహాలు ఇప్పుడు అందరికీ కలుగుతున్నాయి.
ఎందుకంటే రెండు వారాల్లో రిలీజ్ అంటే ఇటు డబ్బింగ్ స్టార్ట్ చేసుకోవాలి అటు ప్రమోషన్స్ చేసుకోవాలి ఈ రెండూ అంత త్వరగా అయ్యే పనులు కావు. ఇటివలే దర్శకుడు వషిష్ఠ కూడా అదే చెప్పుకున్నాడు. తమ దగ్గర అస్సలు టైం లేదని పాన్ ఇండియా రిలీజ్ అంటే చాలా ప్రమోషన్స్ చేస్తూ తిరగాలని అన్నాడు. మరి కళ్యాణ్ రామ్ ఇవన్నీ ఆలోచించకుండా అంత కచ్చితంగా డేట్ చెప్తాడా ? అంటే నందమూరి హీరో ఏదో ప్లాన్ చేసుకొని రెడీ గా ఉన్నాడన్నమాట. మరి చూడాలి తెలుగు రాష్ట్రలో బింబిసార రిజల్ట్ ఎలా ఉంటుందో ?
This post was last modified on %s = human-readable time difference 10:38 pm
బహుశా నిఖిల్ కెరీర్ లోనే తక్కువ సౌండ్ తో వస్తున్న సినిమా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. నవంబర్ 8 విడుదలలో…
ప్రపంచంలో ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ఫారమ్గా ఉన్న వాట్సాప్ అనుచిత ఖాతాలపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో, సెప్టెంబర్ నెలలో…
గత వైసీపీ హయాంలో జగన్ సాగించిన పాలన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు విషమ పరీక్షలు పెడుతోందనే భావన కూటమి…
ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 120 రోజులపాటు విజయవంతమైన…
ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే మొదటి ప్యాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు పార్ట్ 1…
ఒక చిన్న పల్లెటూరు. దాని వెనుకో రహస్యాన్ని దాచుకున్న క్రైమ్. అది ఛేదించడానికి హీరో రంగంలోకి దిగుతాడు. ఊహించని ట్విస్టులతో…