చూస్తుంటే టాలీవుడ్ కొత్త సినిమాల ప్రమోషన్లకు ఒక పర్మనెంట్ టెంప్లేట్ ఫిక్స్ చేసినట్టు కనిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ తో మొదలుపెట్టి అందరూ ఇదే ఫాలో అవుతున్నారు. బిత్తిరి సత్తితో సరదా ముఖాముఖీ, ఆపై సుమతో ఇంటర్వ్యూ, ఇదయ్యాక సోషల్ మీడియా మీమ్స్ గురించి వేరే రెగ్యులర్ యాంకర్ తో చిట్ చాట్, టీవీ ఛానల్స్ కు స్పెషల్ లైవ్ లు, యుట్యూబ్ బ్యాచ్ సెలబ్రిటీలతో ఒక కామెడీ ప్రోగ్రాం ఇలా అందరూ ఒకే తరహా ఫార్మాట్ ని ఫాలో అవుతూ ఇలా చేస్తేనే పబ్లిక్ కి మనం దగ్గరైనట్టుగా దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.
నిజానికిది కరెక్టే అయినా రాను రాను ఇదంతా రొటీన్ ప్రహసనంగా మారిపోతోంది. ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్లి అక్కడ విద్యార్థులను పోగేసి పెద్ద హంగామా చేయడం కిరణ్ అబ్బవరం రేంజ్ చిన్న హీరోతో మొదలుకుని దుల్కర్ సల్మాన్ లాంటి స్టార్ల దాకా అందరూ చేస్తున్నదే.
షాపింగ్ మాల్స్ లో డాన్స్ మాషప్ లు, అక్కడికి వచ్చినవాళ్లుకు సర్ప్రైజ్ గిఫ్టులు ఇలా ఎన్నెన్నో ప్లాన్ చేస్తున్నారు. ప్యాన్ ఇండియా మూవీ అయితే ముంబై, చెన్నై, కోచి, బెంగళూరు ఇలా అన్ని చోట్లకు హీరో హీరోయిన్లు ఫ్లైట్లు వేసుకుని తిరగాల్సిందే.
ఇంత ఖర్చు ఎందుకని ఎవరూ అనుకోవడం లేదు. కారణం ఉంది. నిత్యం సోషల్ ప్లస్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో నానుతూ ఉండాలంటే ఇవన్నీ చేయక తప్పదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కాకుండా అదనంగా ఈ మొత్తం వ్యయాన్ని భరిస్తూ జనాల దగ్గరకు వెళ్లడం అందరూ అలవాటుగా మార్చుకున్నారు. ఇలా చేసినంత మాత్రాన అన్నీ హిట్టవుతాయని కాదు కానీ రాజమౌళి చరణ్ తారక్ అంతటి వాళ్ళే అలుపు లేకుండా దేశం మొత్తం ప్రమోషన్ల కోసం పరుగులు పెట్టినప్పుడు మిగిలినవాళ్లు ఫాలో కావడంలో తప్పేముంది. తప్పదు.
This post was last modified on August 2, 2022 7:27 pm
తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…
హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…
చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…