గత ఏడాది కాలంగా టాలీవుడ్లో ఎక్కువగా వ్యక్తిగత విషయాల గురించి చర్చ జరిగింది అక్కినేని నాగచైతన్య-సమంత జంట గురించే. నాలుగేళ్ల వైవాహిక బంధానికి తెరదించుతూ వీళ్లిద్దరూ విడిపోతున్నారనే వార్త బయటికి వచ్చినప్పటి నుంచి దీని గురించి ఎడతెగని చర్చ జరుగుతోంది. ఇద్దరూ అధికారికంగా తమ విడాకుల గురించి ప్రకటించి పది నెలలు కావస్తున్నా.. ఇంకా తరచుగా ఈ అంశం చర్చనీయాంశంగానే ఉంటోంది.
ఈ వ్యవహారంపై మీడియాను కలిసినపుడల్లా సాధ్యమైనంత వరకు చైతూ మాట్లాడకుండా ఉండడానికే ప్రయత్నిస్తున్నాడు. కానీ మీడియా అతడితో మాట్లాడించేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో చైతూ-సామ్ విడాకుల గురించి చర్చ కొనసాగుతూనే ఉంది. ఈ విషయమై తాజాగా ఒక ఇంటర్వ్యూలో చైతూ అసహనం వ్యక్తం చేశాడు. తన వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతోందనే ఆసక్తి బయటి వారికి ఎందుకని అతను సూటిగా ప్రశ్నించాడు.
ఒక నటుడిగా అందరూ తన వర్క్ గురించి మాట్లాడుకోవాలని కోరుకకుంటానని.. కానీ వ్యక్తిగత విషయాల గురించి కాదని, కానీ ఈ రంగంలో ఉన్న వారి విషయంలో ఆ విషయాలే అందరికీ ఆసక్తి కలిగించడం దురదృష్టకరమని చైతూ అన్నాడు. తాను, సమంత విడిపోతున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించామని.. మంచైనా, చెడైనా జనాలకు ఏదైనా విషయం చెప్పాల్సిన అవసరం ఉన్నపుడు చెబుతామని.. తాను, సామ్ తమ తమ జీవితాల్లో ముందుకు సాగిపోవాలని అనుకున్నామని.. ఐతే తాము చెప్పిన విషయానికి మించి తమ జీవితాల్లో ఏం జరిగిందన్నది ఎవరికీ చెప్పాలని తాను భావించడం లేదని చైతూ స్పష్టం చేశాడు.
తన జీవితంలో ఏం జరిగిందో తన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు తెలుసని చైతూ అన్నాడు. తన గురించి ఊహాగానాలు, ప్రచారాలు తాత్కాలికమే అని.. న్యూస్‌ను న్యూసే రీప్లేస్ చేస్తుందని అతను వ్యాఖ్యానించాడు. దీనిపై తానెంత స్పందిస్తే అంతగా వార్తలు పుట్టుకొస్తాయని, అందుకే సైలెంటుగా ఉన్నానని, ఏదో ఒక రోజు ఇవన్నీ ఆగిపోతాయని చైతూ అభిప్రాయపడ్డాడు.
This post was last modified on August 2, 2022 9:05 am
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…