ఇవాళ్టి నుంచి టాలీవుడ్ షూటింగులు బందని నిన్న ప్రొడ్యూసర్స్ గిల్డ్ తో పాటు ఫిలిం ఛాంబర్ మద్దతు కూడగట్టుకుని నిర్ణయం ప్రకటించిన సంగతి తెలిసిందే. దిల్ రాజే స్వయంగా అనౌన్స్ చేయడంతో దాదాపుగా అన్ని చిత్రీకరణలు నిలిచిపోయాయి. విభేదిస్తున్న తెలంగాణ ఛాంబర్ తరఫున కొందరు చిన్న నిర్మాతలు యథావిధిగా తమ షూట్ లు చేసుకున్నారు.
కానీ దిల్ రాజు నిర్మాణంలోనే రూపొందుతున్న తమిళ సినిమా వారసుడు(వరిసు) వైజాగ్ షెడ్యూల్ జరుగుతున్నట్టుగా వచ్చిన వార్తలు కలకలం రేపుతున్నాయి. దీనికి సంబంధించి ఛాంబర్ అధ్యక్షుడు బసిరెడ్డి ఈ సమాచారం తమకు తెలియదని ఒకవేళ నిజమైతే అలా చేయడం ముమ్మాటికి తప్పేనని అంటున్నారు. మరోవైపు ఎస్విసి టీమ్ ఇది తమిళ సినిమా కాబట్టి ఆ నిబంధన వర్తించదని చెబుతున్నారట.
ఎంత అరవ చిత్రమైనప్పటికీ పని చేస్తున్న వాళ్ళు లోకల్ యూనిట్ కాబట్టి అంత ఈజీగా ఆ వాదనను సమర్ధింపుగా చెప్పలేం. ఎందుకంటే వారసుడుని ముందు నుంచి ప్యాన్ ఇండియా బై లింగ్వల్ గానే ప్రమోట్ చేస్తున్నారు. మరిప్పుడు సింగిల్ లాంగ్వేజ్ ఎలా అయ్యిందో.
ఇప్పుడీ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాలి. భాష ఏదైనా వారసుడులో అధిక శాతం కోలీవుడ్ ఆర్టిస్టులు ఉన్నారు. ఒకవేళ ఇప్పటికిప్పుడు బంద్ చేయాలంటే కాల్ షీట్ల సమస్య రావొచ్చు. మరి దిల్ రాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. హైదరాబాద్ లో ప్రధాన షూటింగులన్నీ ఆపేశారు కానీ చర్చలు, దాని తాలూకు ఫలితాలు, డిస్కషన్లు రేపు ఎల్లుండి నుంచి మొదలవ్వొచ్చు. ఆగస్ట్ నుంచి భారీ విడుదలలు మొదలైన తరుణంలో ఇప్పుడీ పరిణామాలు దసరా రిలీజుల మీద తీవ్ర ప్రభావం చూపించేలా ఉన్నాయి.
This post was last modified on August 1, 2022 8:43 pm
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…