వేసవిలో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 సినిమాల జోరు చూసి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లకు పూర్వ వైభవం వచ్చేసిందని.. ఇక తిరుగులేదని అంతా అనుకున్నారు. కానీ వేసవి సీజన్ పూర్తి కాగానే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సీజన్ చివర్లో, జూన్ నెల మొదటి వారంలో రిలీజైన ‘మేజర్’, ‘విక్రమ్’ చిత్రాల తర్వాత ఏ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటలేకపోయింది.
రాను రాను పరిస్థితి ఘోరంగా తయారై, కొత్త సినిమాలు ఆదాయం తెచ్చి పెట్టకపోగా, వాటిని నడిపించడానికి ఎదురు డబ్బులు కట్టాల్సిన పరిస్థితి తలెత్తింది. జూన్ నెల మొత్తానికి మేజర్, విక్రమ్ మాత్రమే హిట్లు. ఆ రెండు చిత్రాల్లో పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే ‘విక్రమ్’ మూవీనే బిగ్గెస్ట్ హిట్. మార్చిలో ‘ఆర్ఆర్ఆర్’ ప్రభంజనం సృష్టించాక.. ఏప్రిల్లో నెలలో హవా డబ్బింగ్ మూవీ అయిన ‘కేజీఎఫ్-2’దే. తెలుగులో పెద్ద స్టార్ల సినిమాలకు కూడా రాని వసూళ్లు ఈ చిత్రానికి వచ్చాయి.
దీని ముందు తర్వాత వచ్చి ‘సర్కారు వారి పాట’ కూడా దిగదుడుపే అయింది. ఇక ‘ఆచార్య’ సంగతైతే చెప్పాల్సిన పని లేదు. ‘కేజీఎఫ్-2’ తర్వాత బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది డబ్బింగ్ మూవీ అయిన ‘విక్రమ్’యే. దీని తర్వాత తెలుగులో మరో బాక్సాఫీస్ హిట్ ఏది అంటే.. సమాధానం మళ్లీ డబ్బింగ్ చిత్రానిదే కావడం విశేషం. జులై నెలలో ఎన్నో ఆశలు పెట్టుకున్న తెలుగు చిత్రాలన్నీ దారుణమైన ఫలితాలందుకున్నాయి. పక్కా కమర్షియల్, హ్యాపీ బర్త్‌డే, వారియర్, థాంక్యూ, రామారావు ఆన్ డ్యూటీ.. ఇలా ఐదు వారాల్లో రిలీజైన ఐదు క్రేజీ చిత్రాలు డిజాస్టర్లు అయ్యాయి. మొత్తంగా జులై నెల తెలుగు నిర్మాతలకు పీడకలలే మిగిల్చింది.
ఈ నెలకు అసలు ఒక్క హిట్ కూడా ఉండదేమో అనుకుంటే.. మళ్లీ ఒక డబ్బింగ్ సినిమా ఆ లోటును తీర్చింది. ఆ చిత్రమే.. విక్రాంత్ రోణ. ‘ఈగ’తో తెలుగులో మంచి గుర్తింపు సంపాదించిన కిచ్చా సుదీప్ నటించిన ఈ భారీ చిత్రానికి అంత మంచి టాక్ అయితే రాలేదు. కానీ రారా రక్కమ్మ సాంగ్, అలాగే సినిమాలోని ట్విస్టులు, సుదీప్ పెర్ఫామెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. రక్కమ్మ పాట వల్ల సినిమాకు మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. ‘రామారావు’ డిజాస్టర్ కావడం దీనికి కలిసొచ్చింది. వీకెండ్లో రూ.6 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో ఈ చిత్రం హిట్ అనిపించుకుంది. కన్నడ నిర్మాతలే ఈ చిత్రాన్ని తెలుగులో సొంతంగా రిలీజ్ చేయడం విశేషం.
This post was last modified on August 1, 2022 2:30 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…