ఎన్నడూ లేనిది అమీర్ ఖాన్ తన కొత్త సినిమా లాల్ సింగ్ చడ్డా కోసం తెలుగులో చాలా విస్తృతమైన ప్రమోషన్లు చేస్తున్నాడు. ఇప్పటికే రెండు పర్యాయాలు హైదరాబాద్ వచ్చి ఒక ప్రెస్ మీట్, చిరంజీవి ఇంట్లో స్పెషల్ ప్రీమియర్, నాగార్జునకు ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇలా చాలా అంటే చాలానే చేశారు. గతంలో ఎన్నడూ ఇంతలా పబ్లిసిటీ ఇవ్వలేదు. మంగళ్ పాండే, దంగల్ లాంటివి డబ్బింగ్ చేసినప్పుడు కూడా ఈ రేంజ్ శ్రద్ధ తీసుకోలేదు.
పైగా చిరు మీద విపరీతమైన ప్రేమ అభిమానం చూపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇదంతా చూస్తూ అభిమానులు సైతం షాకవుతున్నారు. నిజానికి ఇలా చేయడానికి కారణాలు లేకపోలేదు. టాలీవుడ్ ఎన్నడూ లేనంతగా వెలిగిపోతోంది. ఈ మధ్య థియేట్రికల్ గా కొంత స్లో అయ్యింది కానీ టికెట్ రేట్లు, మంచి కంటెంట్ లాంటి విషయాల్లో మళ్ళీ కుదురుకుంటే పూర్వవైభవం వచ్చేస్తుంది.
సో ఇక్కడి మార్కెట్ ని అమీర్ ఖాన్ కమర్షియల్ కోణంలో చూస్తున్నాడు. మనవాళ్ళకు ప్రమోషన్స్ ద్వారా కనెక్ట్ అయితే ఓపెనింగ్స్ మాత్రమే కాదు కలెక్షన్ల పరంగా మంచి స్పందన వస్తుందని కెజిఎఫ్, విక్రమ్ లను చూసి అర్థం చేసుకున్నాడు. అందుకే తమిళ మలయాళం కన్నా తన ఫోకస్ ఇక్కడే ఎక్కువగా ఉంది. విచిత్రంగా అమీర్ ఈ స్థాయిలో ముంబై మీడియా ముందుకు వెళ్ళలేదు.
త్వరలో ఒక ఈవెంట్ చేయబోతున్నారు కానీ తను ఇంత స్పెషల్ గా హైదరాబాదీ అటాచ్ మెంట్ పెంచుకోవడం అనూహ్యం. నాగ్ తో ముఖాముఖీలో అమీర్ మాట్లాడుతూ చిరుతో ఓ సినిమా తీస్తానని, అది నిర్మాతగా అయినా సరే దర్శకుడిగా అయినా సరే అంటూ ప్రోమోలో క్లూస్ ఇచ్చాడు. ఒకవేళ లాల్ సింగ్ చడ్డా కనక పెద్ద హిట్ అయితే మెగాస్టార్ కు కృతజ్ఞతగా అన్నంత పనీ చేసేలా ఉన్నాడు. ఆగస్ట్ 11 గ్రాండ్ రిలీజ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేశారు. ఫలితం కోసం వెయిట్ చేయడమే మిగిలింది.
This post was last modified on August 1, 2022 1:22 pm
‘పుష్ప: ది రైజ్’ సినిమాలో మిగతా హైలైట్లన్నీ ఒకెత్తయితే.. సమంత చేసిన ఐటెం సాంగ్ మరో ఎత్తు. అప్పటిదాకా సమంతను…
కోలీవుడ్లో పిన్న వయసులోనే మంచి పేరు సంపాయించుకున్నయువ హీరో దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్కు సంబంధం లేకుండా..…
జైలర్ లో చేసింది క్యామియో అయినా తెలుగు తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్…
వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదని పులివెందుల ఎమ్మెల్యే జగన్ చెబుతున్న సంగతి తెలిసిందే.…
గత వారం కంగువ, మట్కాలు తీవ్రంగా నిరాశపరచడంతో థియేటర్లు నవంబర్ 22 కొత్త రిలీజుల కోసం ఎదురు చూస్తున్నాయి. డిసెంబర్…
ప్రేక్షకులు తీర్పు ఇవ్వడంలోనే కాదు ఏదైనా గుట్టు పసిగట్టడంలోనూ తమ తెలివితేటలను ప్రదర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల…