సోషల్ మీడియా పుణ్యమా అని ఏ వార్తయినా యిట్టె ఫోన్లోకి వితిన్ సెకండ్స్ లో వచ్చేస్తుంది. దీంతో చాలా విషయాలు అందరికీ తెలిసిపోతున్నాయి. ఇక ఏదైనా ట్రెండింగ్ న్యూస్ దొరకడం ఆలస్యం యూట్యూబర్స్ వాళ్ళ టాలెంట్ చూపిస్తూ అదిరిపోయే ట్రోలింగ్ వీడియోస్ అందిస్తూ ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తున్నారు.
తాజాగా సీనియర్ నటుడు వీకే నరేష్, పవిత్ర లోకేష్ రిలేషన్షిప్ మేటర్ మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. వీళ్ళ ట్రోలింగ్ వీడియోస్ కి యూ ట్యూబ్ లో లక్షల్లో వ్యూస్ ఉన్నాయి. ఇద్దరూ తమ వ్యక్తిగత విషయాన్ని మీడియా ముందు పెట్టడంతో జనాలకి టాపిక్ గా మారారు.
అయితే ఈ మేటర్ తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఇటివలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. వీరిద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించడం ఆలస్యం థియేటర్స్ లో అరుపులు కేకలు వినిపించాయి. కుర్రకారు వీరిద్దరి పాత్రలను కామెడీ చేసి పారేస్తున్నారు. నిజానికి సినిమాలో అసలు కామెడీ నే లేదు. దర్శకుడు అసలు ఈ కథలో కామెడీ పెట్టకూడదు అనుకున్నాడో ఏమో కానీ ఆ ప్రయత్నం చేయలేదు. పైగా నరేష్ , పవిత్ర లోకేష్ పాత్రలు కూడా కామెడీ పండించలేదు. ఇద్దరివీ వేరు వేరు పాత్రలు ఒకరితో ఒకరికి సంబంధం లేదు. కానీ ఒకే ఫ్రేంలో ఇద్దరూ కనిపించడమే ఆలస్యం థియేటర్ హాలంతా నవ్వులతో సౌండ్ క్రియేట్ అయింది. రామారావు లో కామెడీ లేక పోయినా అనుకోని వీరిద్దరి స్విచువేషణ్ కామెడీ మాత్రం ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తుంది.
ఈ టైంలో వీరిద్దరినీ పెట్టి ఏదైనా హిలేరియస్ ట్రాక్ రాస్తే వీళ్ళ కామెడీ కోసం ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చి మంచి వసూళ్ళు అందించడం ఖాయం. మరి ఏ దర్శకుడైనా ఆ దిశగా ఆలోచించి ఈ ఇద్దరి ని పెట్టి ఏదైనా రొమాంటిక్ కామెడీ ట్రాక్ పెడితే థియేటర్స్ లో ఎపిసోడ్ మాములుగా పేలదు.
This post was last modified on July 31, 2022 8:32 pm
కోలీవుడ్‌లో పిన్న వయసులోనే మంచి పేరు సంపాయించుకున్నయువ హీరో దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్‌కు సంబంధం లేకుండా..…
జైలర్ లో చేసింది క్యామియో అయినా తెలుగు తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్…
వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదని పులివెందుల ఎమ్మెల్యే జగన్ చెబుతున్న సంగతి తెలిసిందే.…
గత వారం కంగువ, మట్కాలు తీవ్రంగా నిరాశపరచడంతో థియేటర్లు నవంబర్ 22 కొత్త రిలీజుల కోసం ఎదురు చూస్తున్నాయి. డిసెంబర్…
ప్రేక్షకులు తీర్పు ఇవ్వడంలోనే కాదు ఏదైనా గుట్టు పసిగట్టడంలోనూ తమ తెలివితేటలను ప్రదర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల…