Movie News

ది లెజెండ్.. థియేటర్లు దద్దిరిల్లిపోతున్నాయ్

ది లెజెండ్.. ఈ మధ్య తమిళ, తెలుగు ప్రేక్షకులను అవాక్కయ్యేలా చేసిన సినిమా. కామెడీ లుక్స్‌తో కనిపించే తమిళనాడు వ్యాపారవేత్త శరవణన్ హీరోగా నటించిన సినిమా ఇది. తమిళనాడులో బాగా ఫేమస్ అయిన శరవణ స్టోర్స్ అధినేత ఇతను. వ్యాపారంలో సంపాదించిన వందల కోట్లలోంచి కొంత డబ్బులు తీసి తనను వెండి తెర మీద మాస్ హీరోగా చూసుకోవాలన్న కోరికను తీర్చుకున్నాడతను. ఆయన్ని హీరోగా పెట్టి జేడీ-జెర్రీ అనే ఇద్దరు దర్శకులు చాలా సీరియస్‌గా పెద్ద కమర్షియల్ సినిమా తీశారు.

ఇందులో హీరో గారు పెద్ద సైంటిస్ట్. ప్రపంచానికి ఉపయోగపడే ప్రయోగాలు చేయడంతో పాటు ఆ మంచికి అడ్డం పడే వాళ్ల బెండు తీసే మాస్ హీరోగా కనిపించాడు శరవణన్ ఇందులో. తన పేరు ముందు తనకు తనే తగిలించుకున్న ‘లెజెండ్’ ట్యాగ్‌నే టైటిల్‌గా పెట్టి సినిమా తీసే సాహసం చేశాడతను. ఈ సినిమా ప్రోమోలు.. ప్రమోషన్లలో శరవణన్ బిల్డప్పులు చూసి అవాక్కయ్యారు. అలాగే నవ్వుకున్నారు జనాలు.

తెలుగు ప్రి రిలీజ్ ఈవెంట్లో అన్ని భాషలనూ కిచిడీ చేస్తూ శరవణన్ చేసిన ప్రసంగం తాలూలు వీడియో మీద తెగ ట్రోలింగ్ జరిగింది సోషల్ మీడియాలో. ఇక ఈ చిత్ర విడుదల సందర్భంగా తమిళనాట నెలకొన్న హంగామా అంతా ఇంతా కాదు. థియేటర్ల దగ్గర ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ టైంలో కనిపించే హడావుడి కనిపించింది. కటౌట్లు పెట్టి పూలమాలలు వేయడాలు.. మ్యూజిక్ బ్యాండ్లను పెట్టి స్టెప్పులేయడాలు జరిగాయి. ఇక థియేటర్లలో కూడా జనం బాగానే కనిపించారు. బహుశా ‘హృదయకాలేయం’ లాంటి సెటైరికల్ మూవీని చూడడానికి మన జనాలు ఆసక్తి చూపించినట్లే.. ‘ది లెజెండ్’ను కూడా కామెడీ యాంగిల్లో చూడడానికి జనం థియేటర్లకు వచ్చినట్లున్నారు.

సినిమాలో శరవణన్ ఇంట్రో సీన్‌ సందర్భంగా థియేటర్లు హోరెత్తి పోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అలాగే సెంటిమెంట్ సీన్లలో శరవణన్ పెర్ఫామెన్స్‌ చూసి పగలబడి నవ్వుకుంటూ కేరింతలు పెడుతున్న దృశ్యాలు కూడా హైలైట్ అవుతున్నాయి. మొత్తానికి ఎలా అయితే ఏం శరవణన్ ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించాడని మాత్రం అర్థమవుతోంది.

This post was last modified on July 30, 2022 5:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

1 hour ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

3 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

4 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

4 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

6 hours ago