కెరీర్ మొదలు పెట్టిన తొలి నాళ్ళ లో కార్తీకి తెలుగులో అంతగా గుర్తింపు లేదు కానీ నా పేరు శివతో తొలి హిట్టు కొట్టాక ఫాలోయింగ్ పెరగడం మొదలయ్యింది. ఆ తర్వాత ఖాకీ, నాగార్జునతో చేసిన ఊపిరి మంచి బ్రేక్ ఇచ్చాయి. క్రమంగా పలకరించిన ఫ్లాపులు మార్కెట్ ని కొంత దెబ్బ తీసినప్పటికీ ఖైదీ రూపంలో దక్కిన బ్లాక్ బస్టర్ తిరిగి ఊపిరి పోసింది. స్వంతంగా డబ్బింగ్ చెప్పుకునే అతి తక్కువ తమిళ హీరోల్లో కార్తీనే ఫస్టు. ఆ మధ్య వచ్చిన సుల్తాన్ ఫలితం నిరాశపరిచినా ఇప్పుడు రాబోయే వాటి మీద చెప్పుకోదగ్గ బజ్ అయితే ఉంది.
ఉన్నట్టుండి నిన్న విరుమన్ విడుదల తేదీని ఆగస్ట్ 12 అని ప్రకటించి యూనిట్ షాక్ ఇచ్చింది. పట్టుమని రెండు వారాలు కూడా టైం లేని పరిస్థితిలో ప్రమోషన్లు ఎలా చేస్తారనే అనుమానం అభిమానుల్లో కలిగింది. పైగా పోటీ కూడా తీవ్రంగా ఉంది. అయితే ఈ హఠాత్ నిర్ణయం వెనుక బలమైన కారణాలే ఉన్నాయి. మొదటిది ఆ స్లాట్ లో రావాలనుకున్న విశాల్ లాఠీ ఎప్పుడో రేస్ నుంచి తప్పుకుంది. ముందు వస్తామని చెప్పిన విక్రమ్ కోబ్రా నాన్చి నాన్చి చివరికి చేతులు ఎత్తేసింది. ఈ రెండు డ్రాప్ అయ్యాక ఆ గ్యాప్ ఖాళీ అయ్యింది.
ఇండిపెండెన్స్ డేకు ఏకంగా నాలుగు రోజుల సెలవులు కలిసిరావడం విరుమన్ వాడుకోవాలని డిసైడ్ అయ్యింది.. లాల్ సింగ్ చడ్డాకు అక్కడ పెద్ద బజ్ ఏమి లేదు. మాచర్ల నియోజకవర్గం ఇక్కడికే పరిమితం. కార్తికేయ 2 వల్ల కార్తీకి వచ్చిన థ్రెట్ ఉండదు. సో అంత సుదీర్ఘమైన వీకెండ్ ని క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. అందుకే తెలుగు మార్కెట్, థియేటర్ కౌంట్ పరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ రిస్క్ తీసుకుంటున్నారు. అన్నట్టు విరుమన్ టైటిల్ ని తెలుగులో పెడతారా లేక తలైవి, వలిమై లాగా అలాగే ఉంచేసి మేమింతే అంటారా చూడాలి.
This post was last modified on July 30, 2022 1:38 pm
ప్రేక్షకులు తీర్పు ఇవ్వడంలోనే కాదు ఏదైనా గుట్టు పసిగట్టడంలోనూ తమ తెలివితేటలను ప్రదర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల…
వైసీపీ అధినేత జగన్ ఆయన పార్టీ తరఫున విజయం దక్కించుకున్న మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ సమావేశాలకు…
రెండు రోజుల క్రితం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ నయనతార విడుదల చేసిన…
ప్రజాయుద్ధ నౌక.. ప్రముఖ గాయకుడు గద్దర్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఎనలేని గౌరవం ఇచ్చింది. గద్దర్ కుమార్తె, విద్యావంతురాలు వెన్నెలను…
దక్షిణాదిన టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే తమన్ పేరు తట్టకపోవచ్చు కానీ.. తన చేతిలో ఉన్నప్రాజెక్టుల లిస్టు చూస్తే…