భానుమతి రామకృష్ణ.. అల్లువారి ‘ఆహా’ ఫ్లాట్ ఫామ్‌లో ఈ రోజు అర్ధరాత్రి నుంచి స్ట్రీమ్ కాబోతున్న సినిమా. నవీన్ చంద్ర, సలోని లూత్రా జంటగా నటించారు. 30 ప్లస్ వయసులో ఉన్న ఓ అబ్బాయి, ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. శ్రీకాంత్ నగోతి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు.
ఐతే విడుదల ముంగిట ఈ చిత్రం వివాదంలో చిక్కుకుంది. భానుమతి, రామకృష్ణల తనయుడు ఈ సినిమా టైటిల్ విషయమై కోర్టుకెక్కారు. ఈ సినిమా టైటిల్ మార్చాలని డిమాండ్ చేశాడు. ఈ పేరు పెట్టేముందు తమ కుటుంబ అనుమతి తీసుకోలేదని పిటిషన్లో పేర్కొన్నాడు.
అతను మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేయగా.. విచారణ జరిపిన కోర్టు తనకు అనుకూలంగా ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. ఈ సినిమా టైటిల్ మార్చాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలొస్తున్నాయి.
ఐతే ఇంకొన్ని గంటల్లో సినిమా రిలీజ్ కాబోతుండగా.. టైటిల్ మార్చమని ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో నిర్మాతలు ఏం చేస్తారో చూడాలి. ఈ రోజు సాయంత్రం నాలుగున్నరకు నేచురల్ స్టార్ నాని ‘భానుమతి రామకృష్ణ’ ట్రైలర్ కూడా లాంచ్ చేయబోతున్నాడు. అర్ధరాత్రి స్ట్రీమింగ్ మొదలవుతుంది. ఈలోపు టైటిల్ మార్చి.. దాన్ని డిజైన్ చేసి సినిమా టైటిల్ కార్డ్స్‌లో చేరుస్తారేమో చూడాలి.
గత ఏడాది హరీష్ శంకర్-వరుణ్ తేజ్‌ల సినిమా ‘వాల్మీకి’ టైటిల్ విషయంలో ఇబ్బంది తలెత్తితే విడుదలకు ముందు రోజే టైటిల్ మార్చారు. ‘గద్దలకొండ గణేష్’ అని పేరు మార్చి.. రాత్రికి రాత్రి టైటిల్ కార్డ్స్‌లోనూ దాన్ని చేర్చి.. కొత్త పోస్టర్లు కూడా వదిలారు. ఎలాగూ ‘భానుమతి రామకృష్ణ’కు థియేట్రికల్ రిలీజ్ లేదు. ఓటీటీ రిలీజ్ కాబట్టి మార్పు మరీ కష్టమేమీ కాకపోవచ్చు. ఈ రోజు రాత్రికే దీనిపై ప్రకటన చేసే అవకాశముంది.
This post was last modified on July 2, 2020 5:35 pm
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం పుంజుకుంటోంది. ప్రధానంగా ఐటీ సంస్థల నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు కూడా ఏఐ ఆధారిత…
ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 ది థర్డ్ కేస్ పూర్తి చేసే పనిలో ఉన్న న్యాచురల్ స్టార్…