వచ్చే నెల 12న విడుదల కాబోతున్న మాచర్ల నియోజకవర్గం మీద నితిన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. గత ఏడాది చెక్, రంగ్ దేలు థియేట్రికల్ గా బాగా నిరాశపరిచాయి. మాస్ట్రో ఓటిటిలో వచ్చింది కాబట్టి సరిపోయింది కానీ లేదంటే అది కూడా ఈ లిస్టులోనే చేరేది.
మాచర్లలో మాస్ ని టార్గెట్ చేసి మెసేజ్ ప్లస్ కమర్షియల్ ఎంటర్ టైన్మెంట్ మిక్స్ తో హిట్టు కొట్టాలనే సంకల్పంతో ఉన్నాడు. లాల్ సింగ్ చడ్డా, కార్తికేయ 2లు పోటీ పడుతున్నప్పటికీ వాటి కంటెంట్ తో పోలిస్తే మాచర్లకే రెగ్యులర్ ఆడియన్స్ మద్దతు ఎక్కువ దక్కే అవకాశం ఉంది
ఇందులో నితిన్ ఐఎఎస్ ఆఫీసర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ పాత్రను చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేశారట. అయితే ఇది నిర్మాణంలో ఉన్నప్పుడు సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ విడుదలయ్యింది. ఆశించిన అంచనాలు అందుకోలేకపోయింది. అందులోనూ హీరో పాత్ర కలెక్టరే. కథ పరంగా కొన్ని సారూప్యతలు ఉండటంతో అవి గుర్తుకు రాకుండా కీలక మార్పులతో మాచర్లకు డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇచ్చారట. ఆ కారణంగానే కొంత ఆలస్యమయ్యిందనే ప్రచారం ఫిలింనగర్ వర్గాల్లో ఉంది.
ఇద్దరు యువ హీరోలు ఒకే పాత్ర చేసినప్పుడు సహజంగానే పోలికలు వస్తాయి. అందుకే మాచర్లకు రిపేర్లు జరిగాయని తెలిసింది. ఇప్పటికైతే అంజలి చేసిన ఐటెం సాంగ్ రారా రెడ్డి బాగా రీచ్ అయ్యింది. నితిన్ కృతి శెట్టిల పాట ఒకటి ఏకంగా ఫుల్ వీడియో రిలీజ్ చేసి షాక్ ఇచ్చారు.
ఇవాళ రాబోతున్న ట్రైలర్ ని బట్టి అంచనాల మోతాదు పెరగడమో తగ్గడమో ఉంటుంది. స్వంత బ్యానర్ లో ఇటీవలే విక్రమ్ రూపంలో పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న నితిన్ ఫ్యామిలీకి ఇప్పుడిదీ హిట్ అయితే డబుల్ జాక్ పాట్ కొట్టినట్టే. చూద్దాం
This post was last modified on July 30, 2022 5:36 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…